Sunday, May 19, 2024
- Advertisement -

నయీమ్ పై కథనాలు ఆపండి …

- Advertisement -

మీ ప్రచారం వల్ల నేరపూరిత సమాజం వైపు యువతను ఆకర్షించే విధంగా ఉంటున్నాయి .చనిపోయాక అందరూ ప్రత్యేక కథనాలు ఇస్తూ వేలకోట్లు సంపాదించాడని రాస్తూ యువతను పక్క దారి పట్టించేవిధంగా ఉంటునాయి నయీమ్ బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు రాయలేదు  వారితో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీస్ యంత్రంగం ఎందుకు పట్టుకోలేక పోయారు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పేర్లు ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకొంటారు.

ఇతను  ఇన్ని వేలకోట్లు సంపాదించిన బ్రతికి ఉన్నప్పుడు అతనికి సహకరించిన వారి అందరి పై  క్రిమనల్ కేసులు నమోదు చేయాలి ఇలాంటి మార్గాన జీవించొన్డు అనే విధంగా వార్తలు  ఉండాలి కానీ మీ ప్రచార సాధనాల ద్వారా కలిగే ప్రచారం గ్యాంగ్ స్టార్ అయితే  డబ్బు త్వరగా  సంపాదించ వచ్చు అనే ప్రేరణ కలుగుతుంది .మెరుగైన సమాజం కోసం ఇలాంటి గ్యాంగ్ స్టార్  కథనాలు ఆపండి ..

నయీమ్ తో సంబంధాలు ఉన్న వ్యక్తులను ఉద్యగాల నుండి తొలగించాలని  వారి పేర్లు బయట పెట్టండి .వారు ఎంత సంపాదించింది వెలికి తీసి సమాజం వారిని వేలి వేసే విధంగా  కథనాలు ఇస్తే ఇంకో సరి నేరస్థుని తో స్నేహం చేయాలనే తలంపు రాకుండా అవుతుంది …. నయీమ్ మరణం తర్వాత స్వాధీనం చేసుకొన్నఆస్తిని ఎం చేస్తారు  నిరుపేదలకు పంచుతారా .యువతకు ఉపాధి కల్పించే చిన్న తరహా  పరిశ్రమలు ఏర్పాటు చేస్తారా .ఎవరికి స్వాధీనం చేస్తారు డబ్బును చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -