Wednesday, May 15, 2024
- Advertisement -

నయనతార కొంప ముంచిన హీరో!

- Advertisement -

తెలుగు, తమిళ వరస సినిమాలతో దూసుకెళ్తుంది అందాల నటి న‌య‌న‌తార‌. చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. దానికి తోడు అమ్మడు రేటు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల‌కు పెరిగింది. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాత‌లు క్యూలో ఉంటున్నారు. రేటు ఎంత అయినా తమ సినిమాలో నటించమని నిర్మాతలు అడుగుతున్నారు.

నయనతార నటించింది అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుంది అనే నమ్మకం ఉంది అందరికి. ఆమె ప‌ట్టింద‌ల్లా బంగారం అన్న‌ట్టుగా సాగుతున్న ఆమె కేరీర్‌ను ఓ ఐరెన్‌లెగ్ నాశ‌నం చేశాడు. అంటే ఆ హీరో న‌య‌న‌ను ఏమీ చేయ‌క‌పోయినా … స‌ద‌రు హీరోతో న‌య‌న న‌టించిన సినిమా బొక్క‌బోర్లా ప‌డింది. ఆ హీరోనే జీవా. ప్రస్తుతం జీవ ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతోంది. మ‌నోడి బ్యాడ్ టైమ్ అలా ఉంది మ‌రి. జీవా వ‌రుస‌గా ఐదు ప్లాపు సినిమాల్లో న‌టించాడు.

క‌నీసం న‌య‌న‌తో జ‌త‌క‌డుతున్నా క‌దా… ఆమె అదృష్టం త‌న‌కు కూడా క‌లిసొచ్చి హిట్ కొడ‌తాన‌ని అనుకుంటే ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌న దుర‌దృష్టాన్ని న‌య‌న‌కు కూడా అంటించేశాడు. ఇటివలే వీరిద్దరు నటించిన తిరునాల్ ఫ్లాపైంది. జీవాకు ఇది వ‌ర‌స‌గా ఆరో ప్లాప్. గ‌త వార‌మే విడుద‌లైన తిరునాల్.. మూడు రోజుల్లో కేవ‌లం 6 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. జీవా స్థాయికి ఇవి చాలా త‌క్కువ వ‌సూళ్లు. ఒక‌ప్పుడు రెండు రోజుల్లోనే 7 కోట్ల మార్క్ అందుకున్నాయి జీవా సినిమాలు. కానీ రూర‌ల్ స్టోరీ.. న‌య‌న‌తార‌-జీవా కెమిస్ట్రీ ఏవీ తిరునాల్ సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. దాంతో న‌య‌న‌తార‌ కేరీర్‌లో మూడేళ్ల త‌ర్వాత ఓ డిజాస్ట‌ర్ వ‌చ్చింది.

Related

  1. ప్రేమ వల్ల జీవితంలో సమస్యలు – నయనతార
  2. నయనతార రేటు ఎంతంటే?
  3. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  4. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -