
కోడి రామకృష్ణ : ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2019, ఫిబ్రవరి 22న మరణించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన సినిమాలు తీశారు.

రాళ్ళపల్లి : అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని మెడీక్యార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 మే 17న మరణించారు. సితార, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన వంటి సినిమాల్లో నటించారు.

గిరీష్ కర్నాడ్ : కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కర్నాడ్.. బెంగళూరులోని లావెల్లే రోడ్‌లో ఉన్న తన నివాసంలో 2019 జూన్ 10 తుదిశ్వాస విడిచారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు.

విజయ నిర్మల : ప్రముఖ నటి, టాలీవుడ్ దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల. 2019 జూన్ 27 అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. దర్శకురాలుగా 44 చిత్రాలను తెరకెక్కించారు.

వేణు మాదవ్ : కాలేయ సంబంధవ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 25మరణించాడు. ఎన్నో సినిమాల్లో కమెడీయన్ గా చేశాను.

గీతాంజలి : సీనియర్ నటి గీతాంజలి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ 2019 అక్టోబర్31 గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు.