Sunday, April 28, 2024
- Advertisement -

గీతాంజలి ఆత్మహత్య..టీడీపీ కార్యకర్త అరెస్ట్

- Advertisement -

టీడీపీ సోషల్ మీడియా వేధింపులతో గీతాంజలి బలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ సింగ్ నగర్‌లో తెనాలి పోలీసులు రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రభుత్వ పథకం కింద ప్రయోజనం చేకూరిందని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పు. నాకు పెన్షన్ వచ్చింది. ఇల్లు వచ్చింది.. అమ్మఒడి వచ్చింది అని చెప్పినందుకు రాక్షసుల్లా వెంటాడి.. గీతాంజలి బలవన్మరణానికి కారణమయ్యారు. చేస్తుంది తప్పా ? ఒప్పా?నైతికమా?అనైతికమా? అనే విచక్షణ లేకుండా ఇష్టానుసారం బూతులు తిట్టడమే కాకుండా ఆమెమీద పోస్టులు సైతం పెట్టి ఘోరంగా హింసించారు. దీంతో వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది గీతాంజలి.

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చనిపోయినా గీతాంజలిని వదల్లేదు. ఫేక్ వీడియోలు తయారు చేసి దానికి వాయిస్ మిక్సింగ్ చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.కానీ నిజం ఎప్పుడు గెలుస్తుంది. అందుకే గీతాంజలి ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -