Friday, May 3, 2024
- Advertisement -

టాలీవుడ్ టాప్ యాంకర్స్ వయసు ఎంతో తెలుసా..?

- Advertisement -

సీరియల్స్, కామెడీ షోలు, రియాల్టీ షోలతో రకరకల ప్రోగ్రామ్స్ తో పలువు యాంకర్స్ బుల్లితెరపై దూసుకెళ్తున్నారు. వీరికి సినిమా హీరోయిన్లతో సరిసమానమైన క్రేజీ ప్రస్తుతం ఉంది. ఇక ప్రస్తుతం బుల్లితెరపై దూసుకెళ్తున్న యాంకర్స్ కి ఎంత వయసు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

సుమ : యాంకరింగ్ లో సుమకి తీరుగులేదని చెప్పాలి. అన్ని భాషల్లో ఈమె చక్కగా మాట్లాడగలదు. అయితే ఈమె పుట్టిన తేది మార్చ్ 22, 1975. వయస్సు: 42 సంవత్సరాలు.

అనసూయ: ఈమె తన కెరీర్ ను న్యూస్ రీడర్ గా ప్రారంభించి.. తర్వాత జబర్థస్త్ షో తో చాలా పాపులర్ అయింది. ఈమెకు ఇద్దరు పిల్లలు.. అయినప్పటికి యూత్ లో ఈమెకి మంచి క్రేజ్ ఉంది. మే15, 1985 పుట్టిన తేది కాగ.. ఈమె వయసు 32 సంవత్సరాలు

రోజా : రాజకీయాలో తనదైన శైలిలో వెళ్తున్న రోజా.. బుల్లితెరపై కూడా షోస్ చేస్తోంది. అలానే జబర్ధస్త్ లో జడ్జీగా కూడా చేస్తోంది. ఈమె వయస్సు: 45 సంవత్సరాలు. నవంబర్ 17 వ తారీఖు 1972 పుట్టిన తేదీ.

శ్రీముఖి : ఈమె యాంకరింగ్ లోకి తక్కువ వయసులో వచ్చి బాగా క్రేజ్ సంపాధించుకుంది. గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఈమె పుట్టిన తేదీ మే 10, 1993. వయస్సు: 24 సంవత్సరాలు.

ఝాన్సీ : యాంకర్ గా, నటిగా దూసుకెళ్తుంది ఝాన్సీ. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈమె పుట్టినతేది మార్చ్ 7, 1971. వయస్సు: 46 సంవత్సరాలు.

శ్యామల : చీరకట్టులో యాంకరింగ్ చేసే వారిలో శ్యామల ముందు ఉంటారు. తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకుంది. ఈమె వయస్సు 32 సంవత్సరాలు. పుట్టినతేది :ఫిబ్రవరి 7 వ తేదీ 1985.

రష్మీ : జబర్థస్త్ ప్రొగ్రామ్ తో రష్మీ ఒక్కసారిగా బాగా ఫాపులర్ అయ్యింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. పుట్టినతేది :ఏప్రిల్ 7 1988. వయస్సు: 29 సంవత్సరాలు

ఉదయభాను : యాంకర్ గానే కాకుండా.. కొన్ని సినిమాలో కూడా నటించింది. కొన్ని సినిమాలో సాంగ్స్ కూడా చేసింది. ఈమె పుట్టినతేది: అగస్ట్ 8 వ తేది 1974, వయస్సు: 43 సంవత్సరాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -