Friday, April 26, 2024
- Advertisement -

బాబుకి చెమటలు పట్టించిన వైఎస్ జగన్

- Advertisement -

గత ఎన్నికల్లో వైసీపీ.. టీడీపీపై కొన్ని ఓట్ల తేడాతో అధికారం దక్కించుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక మూడేళ్లుగా జగన్ చంద్రబాబు ప్రభుత్వం పై పోరడుతునే ఉన్నారు. జగన్ తోపాటు.. రోజా, భూమన, అంబటి లాంటి వాళ్లు రోజు పెస్ మీట్లు పెట్టి బాబు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు అధికారంలోకి వచ్చాక ప్రజల్లో వైసీపీపై నమ్మకం పెరిగింది. బాబు అధికారం దక్కించుకున్న ఎలాంటి సేవ చేయడం లేదని.. ప్రజలు లేటుగా తెలుసుకున్నారు. దాంతో జగన్ ను సీఎం చేసేందుకు ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవలే ప్లీనరీ లో 9 పథకాలు హామీ ఇవ్వడం.. పాదయాత్రకు సిద్దం అవ్వడంతో ప్రజల్లో వైసీపీపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే జగన్ ఇచ్చిన హామీలని.. మరిపించేలా.. కొత్త స్కీమ్స్ తేవాలని టీడీపీ ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ ఇచ్చిన 9 హామీలలో మద్యనిషేధం అనేది మహిళలకి బాగా నచ్చింది. తాగుడు వల్ల కుటుంబాలు రోడ్డున పడుతుడటంతో.. మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మద్యనిషేధంపై వాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. వీరు ఇప్పుడు జగన్ వైపు వెళితే టీడీపీ ఓడిపోవడం పక్కా. అందుకే ఇప్పుడు మహిళలని శాంతింపచేయాలని.. టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణం బెల్ట్ షాపులని ముయించడమే కాకుండా.. తాగినవారిని వెంటనే అరెస్ట్ చేయమని కూడా చంద్రబాబు అధికారులని ఆదేశించారు. విచిత్రం ఏంటంటే.. ఏపీలో 2014, జూన్ 8 న బాబు బెల్ట్ షాపులని నిషేదించాలని.. ఫైలుపై సంతకం పెట్టారు.

సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. చంద్రబాబు సంతకాలు పెట్టిన పైలుల్లో బెల్ట్ షాప్ నిషేధం ఒక్కటి. అంటే బాబు మూడేళ్ల క్రితమే షాపులని నిషేదించారు. మళ్లీ ఇప్పుడు బెల్ట్ షాపులను మూసెయ్యమని చెప్పడం అంటే.. ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా.. సీఎం మూడేళ్ల క్రితమే నిషేధించిఅమ బెల్ట్ షాపులు ఇంకా నడుతున్నాయి. ఇందుకు కారణం ఎవరు..? ఇది సీఎం అసమర్థత కిందికి వస్తోందని అంటున్నారు. ఏది ఏమైన ఫస్ట్ టైం జగన్ సీఎం చంద్రబాబు పై సక్సెస్ అయ్యి.. చంద్రబాబుకి చెమటలు పట్టించారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -