టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉందో తల్లి, ఆంటీ పాత్రలు పోషిస్తున్న సీనియర్ హీరోయిన్స్ కి కూడా అదే క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా మంది ఒకప్పటి హీరోయిన్స్ తల్లి, అత్త, అక్క పాత్రలు పోషిస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారేవరో ఇప్పుడు చూద్దాం.

రమ్య కృష్ణన్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రమ్య.. ఇప్పుడు తల్లి, అత్త పాత్రలు చేస్తోంది. బాహుబలితో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమె రోజుకి 6 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

నధియ
అందంగా ఉంటూ తన నటనతో అందరిని మెప్పిస్తూ వరస సినిమాలతో దూసుకెళ్తోంది నధియ. అత్తారింటికి దారేది – మిర్చి – దృశ్యం వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె రోజుకి 2 నుంచి 3 లక్షలకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

జయసుధ
జయసుధ ఏ పాత్ర పోషించిన అందులో జీవించేస్తుంది. అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె రోజుకు 2 లక్షలు పైనే పారితోషకం తీసుకుంటుంది.
రేవతి
రేవతి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఎక్కువ సినిమాలు చేయనప్పటికి.. ఈ మధ్య తల్లి పాత్రలు చేయడానికి ఒప్పుకుంటుంది. 2 నుంచి 5 లక్షలు డైలీ పేమెంట్ గా తీసుకుంటుంది.

పవిత్ర లోకేష్
వయసులో చిన్నదే అయినప్పటికి తల్లి, అత్త పాత్రల్లో నటించి మెప్పిస్తోంది పవిత్ర లోకేష్. ఈమె రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటుంది.

రాశి
హీరోయిన్ గా ఫాం లో ఉన్నపుడే పెళ్లి చేసుకున్న రాశి. ఇటివలే కాలంలో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. ప్రస్తుతం రాశి రోజుకి 75వేలకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

శరణ్య పొన్వన్నన్
కోలీవుడ్‌లో ఫేమస్ అమ్మ శరణ్య. తెలుగులో తక్కువ సినిమాల్లో తల్లి పాత్రలు పోషించింది శరణ్య. ‘ఇంద్రుడు’, ‘రఘువరన్ బిటెక్’ సినిమాలతో బాగా పేరు తెచ్చుకుంది శరణ్య. సినిమా కుటుంబం నుంచే వచ్చినా హీరోయిన్‌గా కన్నా కూడా తల్లి పాత్రల ద్వారానే శరణ్య బాగా పేరు తెచ్చుకుంది. రోజుకి 40నుంచి 50 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

హేమ
హేమ – 40 నుంచి 50 వేలు డైలీ పేమెంట్…