ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అలా మన స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇప్పడు చూద్దం..!
టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహేష్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండగనే. మహేష్ కు సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది మాత్రం ఒక్కడు సినిమా. ఈ సినిమా నుంచి మాస్ హీరోగా మహేష్ ఎదిగాడు. ఇక అప్పటి నుంచి మహేష్ వెనదిరిగి చూసుకోలేదు. ఇక రీసెంట్ గా మహేష్ మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అయితే మనసంతా నువ్వే, వర్షం, ఇడియట్, గజిని, ఏ మాయా చేసావె, అ ఆ, 24, ఫిదా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించారట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తి అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు 19 మాత్రమే. ప్రస్తుతం ప్రభాస్ 20 వ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో రాదే శ్యామ్ చేస్తున్నాడు. తరువాత ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా తేరకెక్కనున్న విషయం తేలిసిందే. అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు 10 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ఉనాయి. ఒక్కడు, సింహాద్రి, ఆర్య, దిల్, నాయక్, కిక్, బృందావనం, డాన్ శీను, ఊసరవెల్లి, జిన్ సినిమాలను వదులుకున్నాడు ప్రభాస్.
బాల రామాయణం చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈరోజున పెద్ద స్టార్ అయ్యాడు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్ని పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా లోపాలను తెలుసుకుని మళ్లీ హిట్స్ కొట్టాడు. అయితే ఎందుకో ఎన్టీఆర్ వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి కొన్ని ప్లాప్ అయ్యాయి. వాటిలో దిల్, ఆర్య, అతనొక్కడే, భద్ర, కృష్ణ, కిక్, ఎవడు, శ్రీమంతుండు, ఊపిరి, బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలను ఎన్టీఆర్ వదులు కున్నారట.
రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర్ సినిమాలో నటించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే ఎటో వెల్లిపోయింది మనసు, ఓకే బంగారం, సుర్య s/o కృష్ణన్ తెలుగులో, కృష్ణార్జున యుద్ధం, నేలటికేట్ వంటి సినిమాలను మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వదులుకున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి.. మార్చి 28 2003 లో విడుదల అయ్యింది. దాంతో ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తయ్యింది. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించాడు. ఈ సినిమాని అల్లు అరవింద్, అశ్వినీ దత్ కలిసి నిర్మించారు. మొదటి సినిమాతోనే బన్నీ సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్స్ తో దూసుకెళ్ళుతున్నాడు. జయం, భద్ర, 100 % లవ్, పండగ చేస్కో, కృష్ణాష్టమి, ఒక లైలా కోసం, అర్జున్ రెడ్డి, నానీస్ గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, జాను, గీత గోవిందం, అరవింద సమేత వంటి సిమాలను వదులు కున్నారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
టాలీవుడ్ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!
మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?
మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?
టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?