Tuesday, April 30, 2024
- Advertisement -

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం…..ఈనెల 25న ప్ర‌మాణ స్వీకారం

- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్‌ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు.కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు 7,02, 644 ఓట్లు రాగా, మీరాకుమార్‌కు 3,67, 314 ఓట్లు విలువ వచ్చాయి. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గురువారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి రౌండు నుంచే రామ్‌నాథ్‌ కోవింద్‌ తన ప్రత్యర్థి మీరా కుమార్ పై అధిక్యంలో కొనసాగారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్ నాయకులు, మమతా బెనర్జీ అభినందించారు.

నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ సాగింది. తొలుత పార్లమెంట్‌ భవన బ్యాలెట్‌ పెట్టెను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ క్రమంలో రాష్ట్రాల వారీగా బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి లెక్కించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్‌ నమోదైంది. మీరా కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా పోలవలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -