Sunday, May 19, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు

- Advertisement -

ఎదిగే కొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుందని చంద్ర బోస్ ఏముహూర్తాన అన్నాడో గాని ఆ మాట వరుణ్ తేజ్ విషయంలో కరెక్ట్ గా సెట్ అవుతుంది.

కంచె లాంటి వండర్ క్రియేట్  చేసినప్పటికీ…వరుణ్ లో ఎలాంటి పొగరు లేదని పరిశ్రమ చెబుతుంది. మరిచిపోలేని హిట్లు వచ్చినప్పుడు ఏ హీరోకైనా ఒకలాంటి బలుపు వస్తుంది.ఐతే స్వతహాగా తన తండ్రి నుంచి అబ్బిన ఇచ్చిపుచ్చుకోవటాలు వరుణ్ కు భాగా వంట బట్టడంతో ఎలాంటి బలుపును వరుణ్ చూపించడం లేదు..కంచె తర్వాత అతను చేసే వెంచర్ విషయంలో వరుణ్ ఎలాంటి ఇగోలు చూపకుండా మంచి కథలతోవచ్చే దర్శకులను ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకుంటూ తాను కథలు వింటూ… తనకు నచ్చితే తన తండ్రి అపాయింట్ మెంట్ కూడా ఆ కొత్తగా వచ్చిన దర్శకుడికి బదులుగా తనే తీసుకుని నాగబాబుకు కథలు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

నాగబాబు కథను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా…వరుణ్ ఇచ్చే ఆతిధ్యం నేటి కుర్ర దర్శకులకు భాగా నచ్చడంతో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు వరుణ్ అపాయింట్ మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -