వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి నీతులు చెబుతున్నాడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు జగన్ కు ఒక హితబోధ చేశాడు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దీక్ష చేపట్టడం సరికాదేమో అని వెంకయ్య వ్యాఖ్యానించాడు. ఇంతకీ వెంకయ్య ఏమంటాడంటే.. జగన్ దీక్ష ఇప్పుడు చేపట్టాల్సింది కానీ.. అందుకు తగిన సమయంలో మాత్రమే దీక్ష చేపట్టాల్సిందని వెంకయ్య చెప్పకొచ్చాడు. మరి ఆ తగిన సమయం ఏమిటో మాత్రం ఈ కేంద్రమంత్రి వర్యులు సెలవియ్యలేదు!
అయినా ప్రత్యేక హోదా విషయంటో మాట మార్చడంలో వెంకయ్య లాంటి వాళ్లు ముందున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాష్ట్ర విభజనకు మద్దతు పలికి.. వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదాను గట్టిగా డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ హయాంలో విభజన జరుగుతున్న సమయంలో వెంకయ్య మాట్లాడుతూ… ఏపీకి ఐదు కాదు.. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా దక్కాలని అన్నాడు. అయితే ఇప్పుడు… మాత్రం ఆయన ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటం లేదు. మాట్లాడినా.. అదంత అవసరం కాదు, అది తమ బాధ్యత కాదు అని అంటున్నాడు. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరో.. చాలా నిర్భయంగా మాట్లాడుతున్నాడు వెంకయ్య నాయుడు.
ఇలాంటి నేపథ్యంలో వెంకయ్యకు ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? ఈయన ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో దీక్షల గురించి.. పోరాటం గురించి జగన్ కు సూచనలు ఇవ్వడం మరింత కామెడీ అవుతోంది. అయినా వెంకయ్యకు అలాంటి మొహమాటాలు ఏమీ లేకుండా.. తను, తమ పార్టీ మాట తప్పిన విధానాన్ని పక్కనపెట్టి.. ఇప్పుడు తీరగ్గా నీతులు చెప్పడం విశేషం.