- Advertisement -

పక్షవాతం తగ్గాలంటే ఏం చెయ్యాలి…!

- Advertisement -

పక్షవాతం తగ్గాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉన్న కొన్ని పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.

అవేంటో తెలుసుకుందామా… కటుక రోహిణి చూర్ణం ఆముదంతో సేవించుచున్న పక్షవాతం తగ్గును. సారాయితో శొంఠిని అరగదీసిన గంధం పూసిన పక్షవాతం తగ్గుతుంది. నీరుల్లి రసం, అల్లపురసం, తేనె సమ భాగమున కలిపి పూటకు 5 తులములు చొప్పున తాగితే పక్షపాతం నయమవుతుందట. వేయించిన ఇంగువ 8 గోధుమల ఎత్తు ప్రతిరోజు ఒక్కసారి తేనె అనుపానముతో ఇచ్చుచున్న పక్షవాతము హరించును. చిత్ర మూలము సమూలముగ దంచి నువ్వుల నూనెలో మరిగించి ఆ తైలమును పూసుకుంటే మంచిదట.

దుష్టపాకు, ఉత్తరేణి, పిప్పెంట సమభాగాలుగా చేర్చి గానుగనూనెలో మరిగించి తైలమును దీసి మర్థన చేస్తే పక్షవాతం తగ్గుతుందట. సదాపాకు రసములో, కరక్కాయ చూర్ణమును కలిపి సేవిస్తే పక్షవాతం తగ్గుముఖం తగ్గుతుంది. నేతిలో వేయించిన ఇంగువను 5 నుంచి 15 గోధుమ గింజల ఎత్తు ఒకటి భై 4 నుంచి ఒకటి భై 2 గ్రాములు తేనె అనుపానముగ ఇస్తే పక్షవాతం తగ్గిపోతుండట. దీనితో పాటు ఒక భాగం తేనె రెండు భాగములు మంచినీరు కలిపి మూడువంతులు మిగులునట్లు కానీ ఆ నీటిని పూటకు మూడు తులములు చొప్పున రోజుకు మూడు పూటలా సేవిస్తే మూతి వంకర అయ్యే రోగం తగ్గుతుందని అంటున్నారు.

పక్షవాతం సోకిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం :

ఫిజియోథెరపీలో రోగికి మందులు అందిస్తూనే శారీరకంగా, మనసికంగా చికిత్స అందిస్తారు. పక్షవాతంతో బలహీనపడ్డ శరీర కండరాలను నయం చేస్తూ రోగిని పూర్వస్థితికి తెస్తారు. రోగి కూర్చునే , పడుకునే, నిలబడే, నడిచేవిధానాలు, మెట్లు ఎక్కడం, దిగడం క్రమ పద్దతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. 0-1 గ్రేడ్‌ కోసం బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్‌ స్టిమ్‌లేటర్‌ చికిత్స చేస్తారు.

ఆపై 1-5వరకు సస్పెన్షన్‌ థెరఫీ, ఇన్‌క్లెయిన్‌బోర్డు, వేయిట్‌ బేరింగ్‌, క్వార్టర్‌ సైడ్‌ చేయిల్‌, ఫోల్డర్‌, పుల్లీవాల్‌ ల్యాపర్‌, స్టెఫ్‌ ఆఫ్‌ స్టెఫ్‌డౌన్‌, కాడ్‌మాన్‌, సైక్టింగ్‌ ఎక్సైర్‌సైజ్‌లతో కండరాన్ని, బలపరుస్తారు. అనంతరం సరైన నడకను నేర్పించడానికి ప్యారలాల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయిస్తారు.

ముఖానికి నిమ్మరసం మంచిదేనా

గుండె సమస్యలకు ఈ మూడే కారణాలట..

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -