Monday, May 13, 2024
- Advertisement -

ముఖానికి నిమ్మరసం మంచిదేనా

- Advertisement -

కాలుష్య ప్రభావమో.. లేక మరేకారణమో తెలియదు కానీ.. నేటి కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చర్మాన్ని కాంతి వంతంగా.. ఆకర్షనీయంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్క ప్రాడక్ట్ ను వాడుతూ.. కొత్త కొత్త చర్మ సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.

డబ్బులు పెట్టి మరీ కొత్త సమస్యలను తెచ్చుకోకుండా ఇంట్లో లభించే ఒక్క నిమ్మకాయతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. మరి ఏ విధంగా ఉపయోగించాలో మీరు కూడా ఓ లుక్కేయండి.యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగున్న నిమ్మకాయ చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

టీ స్పూన్ తేనే, కొంచెం నిమ్మరసం, అరటీస్పూన్ ఉడికించి గ్రైండ్ చేసుకున్న క్యాబేజ్ పేస్ట్ తీసుకోవాలి.. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడ, ముఖం పై బాగా పట్టించాలి.. ఒక పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే.. పొడిబారిన చర్మం నిగనిగలాడుతుంది. అలాగే సమపాల్లలో నిమ్మరసం, టమాటారసాన్ని మిక్స్ చేసి ముఖంపై రాస్తే మంచి నిగారింపు వస్తుంది. ఈ చిట్కాలను కనుక క్రమం తప్పకుండా పాటిస్తే మీ చర్మ సమస్యలు దరి చేరవు.

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

ప‌సుపు పాల‌తో ప్ర‌యోజ‌నాలెన్నో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -