Thursday, May 16, 2024
- Advertisement -

ఓటుకు కోట్లుః బాబు అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?

- Advertisement -

‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు చెప్పిన మాటల ఆడియో సాక్ష్యం స్పష్టంగా ఉంది. ఇక వీడియోలో రేవంత్ రెడ్డి అద్భుతమైన పెర్ఫర్మెన్స్‌తో చెప్పిన అన్ని డిటెయిల్స్ ఉన్నాయి. డబ్బు కట్టల సంచీ కూడా దొరికింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇంకా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఓటుకు కోట్లు కేసు టైంకి కనీసం పార్టీలో ప్రధాన పదవి కూడా లేని రేవంత్‌రెడ్డి ఒక్కడే చంద్రబాబుకు ఏమీ చెప్పకుండా డబ్బు పంపకాలు, కొనుగోళ్ళ వ్యవహారాలు చేపట్టాడంలే ఎవ్వరూ నమ్మరు.

ఒక వేళ పచ్చ బ్యాచ్ జనాలందరూ అలా నమ్మించాలని చూసినప్పటికీ……‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ……వాళ్ళు చెప్పిన మాటలన్నింటికీ నాదీ పూచీ’ అనే స్థాయిలో నిప్పునారా బాబు మాటల్లో అంతా నేనే చేశాను అని బాబే చెప్పుకున్న అర్థం ఇట్టే తెలిసిపోతుంది. ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్స్ తేల్చిచెప్పాయి. అన్నింటికీ మించి రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ స్థాయి ప్రముఖ జర్నలిస్టులతో పాటు తెలుగు జర్నలిస్టులందరూ కూడా ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అన్న వాయిస్ మీదా? కాదా? అన్న ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. రకరకాల సమాధానాలు చెప్తూ అడ్డంగా వాదించడమే తప్పించి……….మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ నాది కాదు అని ఇప్పటి వరకూ చంద్రబాబు ఎప్పుడూ చెప్పింది లేదు. ఒకవేళ చంద్రబాబే కనుక మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసుగా. ఆ వాయిస్ తనది కాదు అని స్పష్టంగా చెప్పొచ్చుగా. కానీ ఇఫ్పటి వరకూ ఆ వాయిస్ తనది కాదు అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు. ఇక్కడే మొత్తం అక్రమ వ్యవహారానికి చంద్రబాబే సారథి……బాబే నంబర్ ఒన్ అన్న విషయం స్పష్టగా తెలియట్లేదా? అయినప్పటికీ బాబు అరెస్ట్ ఇంతవరకూ ఎందుకు జరగలేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలుగు ప్రజల మధ్య చర్చనీయాంశం అవుతోంది? న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇక సిబిఐ, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌లో కూడా బాబుకు లోపాయికారిగా సాయపడేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే ఇప్పటి వరకూ బాబు అరెస్ట్ సాధ్యం కాలేదు. అయితే ఇప్పటి వరకూ ఒక లెక్క………ఇప్పటి నుంచీ ఒక లెక్క అన్నట్టుగా ప్రస్తుతం మోడీతో పూర్తి శతృత్వం కొనితెచ్చుకున్నాడు చంద్రబాబు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి కెసీఆర్‌ని ఓడించాలన్న బాబు కుటిల ప్రయత్నాలను పసిగట్టిన కేసీఆర్ కూడా ఇప్పుడు బాబుపై కోపంగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ప్రత్యర్థులైన కాంగ్రెస్‌ని గెలిపిస్తాననే రేంజ్‌లో కర్ణాటకలో కూడా రెచ్చిపోతూ ఉండడం…..అలాగే తెలంగాణాలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కెసీఆర్‌ని ఓడించి కాంగ్రెస్‌ని గెలిపిస్తానంటూ ఉండడంతో మోడీ, కెసీఆర్‌లకు చంద్రబాబు ఉమ్మడి శతృవు అయ్యాడు. ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ అరెస్ట్ వ్యవహారాన్ని ఎలాగో మేనేజ్ చేసి తప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం అరెస్ట్ నుంచి తప్పించుకోలేడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -