ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని 2014 లో ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ దిక్కూ దివాణం లేడు. ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరవడం ఎదో ఒకటి ప్రెస్ మీట్ లో మాట్లాడ్డం తప్ప పవన్ కళ్యాణ్ జనం ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ప్రజల తరఫున ఒక్క విషయం లో కూడా అండగా నిలబడలేదు.
రైతుల భూములు లాక్కుంటున్న సమయం లో వచ్చి వారికి అండగా నిలిచాడు తప్ప మళ్ళీ అంత ఎత్తు ఉద్యమం ఎక్కడా చెయ్యలేదు కళ్యాణ్ . ఏపీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి గొడవ గొడవ చేస్తోంది. ఒక పక్క డిల్లీ పాలకులు మనమీద చూపిస్తున్న వివక్ష చూసి ప్రతీ తెలుగు వాడి గుండె మండిపోతోంది ఈ టైం లో కళ్యాణ్ స్వయంగా బయటకి వచ్చి మాట్లాడాలి అని ఫాన్స్ సైతం కోరుతున్నారు. ఇలాంటప్పుడు కాకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడతాడు అని వారు కూడా కోప్పడుతున్నారు.
ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై తాను దృష్టి పెట్టానని.. అవసరమైన సమయంలో తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పిన పవన్.. తాజాగా ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఓపక్క ప్రత్యేక హోదా అన్నది లేదని జైట్లీ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. పవన్ ఎందుకు గళం విప్పటం లేదని.. ఎందుకు ప్రశ్నించరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ని నిద్ర లెమ్మని కొందరు సీరియస్ వార్నింగ్ లు ఇస్తున్నారు.
Related