ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఎసిబి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రేవంత్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఈ పిటీషన్ విచారణకు రాగా ఏ రకంగా బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు అని ఏసిబిని సుప్ర్రీం కోర్టు ప్రశ్నించింది. ఏసిబి తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కేసులో ఇంకా సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ రద్దు చేయాలని కపిల్ సిబల్ వాదించారు. దీనికి బదులుగా సెక్షన్ 164 కింద వాంగ్మూళం రికార్డు చేశారు.
అరెస్టయిన ఒక్కరోజులో బెయిల్ వస్తే పరిశీలించాలి. రేవంత్ రెడ్డి 30 రోజులు జైల్లో ఉన్నారని పేర్కొని అనంతరం కేసును రద్ధు చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
