Friday, May 17, 2024
- Advertisement -

ఎయిర్ ఏషియా సిబిఐ కేసు…… పచ్చ నీతికి సాక్ష్యాలు ఇవిగో

- Advertisement -

అవినీతి, అక్రమ మార్గాన అనుచిత లబ్ది పొందాలనుకున్న ఒక వ్యాపారస్తుడికి అవినీతి సొమ్ముతో ఆ అక్రమ పని చేసిపెట్టగల సమర్థుడిగా అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు కనిపించారు. అక్రమ మార్గాల్లో పనులు చేయించడంలో సిద్ధహస్తుడైన ఒక జాతీయ స్థాయి ప్రముఖ బ్రోకర్‌కి అలాంటి అక్రమ పనులు సింపుల్‌గా అయిపోవాలంటే ఫలానా చంద్రబాబుతోనే సాధ్యం అని ఆ బ్రోకర్ నమ్మకంగా చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఆడియో టేపుల్లో నిక్షిప్తమై ఉంది. ఇక అశోక్ గజపతిరాజు ఆ ఆడియో టేపుల్లో మాట్లాడిన కంపెనీకి సంబంధించిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. ఆ కంపెనీ ఆశించినట్టుగానే పర్మిషన్స్ కూడా వచ్చాయి. 

అయినప్పటికీ పచ్చ బ్యాచ్ మీడియా మొత్తానికి ఈ వ్యవహారం కనీసం వార్తగా కూడా కనిపించలేదు. వైఎస్ చనిపోయాక కూడా ఎక్కడో ఏదో వైఎస్ పేరు కనిపించినా, లేకపోతే కెవిపి పేరు కనిపించినా ……….ఇంకేముంది వైఎస్‌ పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయింది అని కథలు అల్లగలిగిన ఆర్కేకి కానీ నంబర్ ఒన్ పత్రికకు కానీ ఈ ఎయిర్ ఏషియా న్యూస్ అస్సలు ప్రాధాన్యత ఉన్నదిగా కూడా కనిపించలేదు. సింగపూర్ అంటేనే అవినీతి మచ్చలేని దేశం అని చెప్పుకుంటూ ఉంటాడు బాబు. ఆ రకంగా తను అనుక్షణం జపిస్తూ ఉండే సింగపూర్ కూడా తనలాగే నిప్పులాంటిదే అని చెప్పడం బాబు ఉద్ధేశ్యం. ఆ మధ్య సింగపూర్ దేశం అవినీతిలో నంబర్ ఒన్ అని తేలితే గొప్పగా మేనేజ్ చేశారు పచ్చ బ్యాచ్. ఇప్పుడు అదే సింగపూర్‌కి చెందిన ఒక కంపెనీ కూడా బాబుగారి పేరు వినిపించిన ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామి అయి ఉంది. అమరావతితో ముడిపడి ఉన్న సింగపూర్ అయినప్పటికీ పచ్చ మీడియాకు వార్త కాలేదు. విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోయినట్టుగా అస్సలు కనిపించలేదు. 

పర్ సపోజ్…….ఫర్ ఎక్జాంపుల్……ఇదే వ్యవహారంలో చంద్రబాబు పేరు స్థానంలో జగన్ పేరు వినిపించి ఉంటే………..ఇక చూస్కోండి నా సామి రంగా……….మోడీతో కలిసి జగన్ అవినీతి, అక్రమ వ్యవహారాలు, లక్షల కోట్లు, సింగపూర్‌తో సహా ఇతర దేశాల్లో నల్లధనం దాచాడు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ పరువు, ఇండియా పరువు తీశాడు అని పేజీలకు పేజీలు కథలు అల్లేవారు కాదా? ఇక బాబు బ్యాచ్ అయిన జయప్రకాష్ నారాయణ, జేడీలాంటి వాళ్ళందరూ జగన్ అవినీతి అంటూ ఇష్టారీతిన మాట్లాడేవారు కాదా? పచ్చ ఛానల్స్‌లో కూర్చుని గంటలు గంటలు జగన్ అవినీతి అంటూ చర్చలు నడిపేవారు కాదా?  నిప్పు అని చెప్పుకునే బ్యాచ్ అసలైన నీతి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క వ్యవహారం సాక్ష్యం చాలదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -