Monday, May 6, 2024
- Advertisement -

తూ.గో.లో ఆ పదిమంది తె.దే ఎమ్మెల్యేలు గెలవలేరుః సర్వే రిపోర్ట్

- Advertisement -

2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయే అవకాశం ఉంది అని సర్వేలు తేల్చిన సీట్లన్నింటిలోనూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను బలిపశువులను చేయడానికి రెడీ అయిపోతున్నాడు చంద్రబాబు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా ఓడిపోయే అవకాశం ఉన్న అలాంటి పదిమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఎగ్గొట్టడం ఖాయం చేసేశాడు చంద్రబాబు. చంద్రబాబుకు లగడపాటి ఇచ్చిన సర్వే రిపోర్ట్స్‌తో సహా గతంలో వచ్చిన సర్వేలన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో పది మంది టిడిపి ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని తేల్చేశాయి.

అయితే తాజాగా 2019 ఎన్నికలే లక్ష్యంగా అభ్యర్థులను ఫైనల్ చేసే ఆలోచనలు చేస్తున్న చంద్రబాబు మొత్తం పాపాన్ని ఆ పదమంది ఎమ్మెల్యేలకే ఆపాదిస్తూ అందరూ కొత్తవాళ్ళను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ముందుగా వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయిన రంపచోడవరం ఎమ్మెల్యేకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోవడం లేదని చంద్రబాబు తేల్చేశాడు. ఇక కాకినాడ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, రాజమండ్రి పరిధిలో 2014 ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేకు టిక్కెట్స్ ఇవ్వడం కుదరదని తేల్చేశాడు చంద్రబాబు. మొత్తంగా చూస్తే దాదాపు పది సీట్లలో టిడిపికి ఓటమి ఖాయం అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని స్థానిక టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ఇసుక మాఫియాతో సహా అవినీతి వ్యవహారాలు, రుణమాఫీలాంటి హామీలు ఏవీ నెరవేరకపోవడంలాంటి ఎన్నో విషయాల్లో సాక్షాత్తూ చంద్రబాబుపైనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని…….ప్రజాగ్రహాన్ని మొత్తం స్థానిక ఎమ్మెల్యేలపైకి నెట్టేసి అభ్యర్థులను కొత్తవాళ్ళను నిలబెట్టినంత మాత్రాన ఫలితాల్లో మార్పు ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నాట ప్రజలందరూ కూడా పార్టీల అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసే ఓట్లు వేస్తారే తప్ప స్థానిక నాయకుడిని పెద్దగా పట్టించుకోరని……చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్నికల ఏడాదిలో ఎన్ని పూతలు పూసినా 2014 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన గోదావరి జిల్లాల్లో ఈ సారి టిడిపికి గట్టి దెబ్బతగలడం ఖాయమని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. కుల సమీకరణాలు కూడా ఈ సారి చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. లగడపాటి చేత చంద్రబాబు చేయించుకున్న వ్యక్తిగత సర్వేలో కూడా ఇంచుమించుగా ఇవే విషయాలు బయటపడడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -