Wednesday, May 8, 2024
- Advertisement -

దారుణం : అక్కడ మగవారిని.. ఆడవాళ్లు రేప్ చేస్తారట

- Advertisement -

రోజు ఎక్కడో ఒక చోట రేప్‍కు సంబంధించిన వార్త చూస్తునే ఉన్నాం. అయితే ఈ రేప్ అంటే ఏంటి..? ఇకరి మానాన్ని భంగం చేయడం.. అంటే ఒకరి అనుమతి లేకుండా లైంగికంగా వారిపై దాడి చేయడం.. వారితో లైంగికంగా కోరిక తీర్చుకోవడం. జనరల్ గా మగవారు ఆడవాళ్ళపై లైంగికంగా దాడి చేస్తుంటారని మనం రోజుకు ఒక్క వార్త అయిన వింటూ ఉంటాం. మరి అదే పని ఓ మహిళ పురుషుడితో చేస్తే ? మరి దాన్ని ఏమనాలి ? రేప్ అనాలా లేక ఇంకేదైనా పేరు ఉందా ? దాన్ని రేప్ అనరు “ఫోర్సేడ్ టూ పెనట్రేట్” అంటారు అంటున్నారు లండన్ వారు.

ఆంగ్లంలో చెప్పాలంటే “Forced to Penetrate”. లండన్ లో అబ్బాయిల మీద లైంగిక దాడులు, మానభంగాలు ఘోరంగా జరుగుతున్నాయట. నిజమే మీరు విన్నది. అక్కడ మగవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలే ఇవి చేస్తున్నారు. అయితే కేవలం లండన్ లోనే కాకుండా.. కొన్ని వెస్టర్న్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అమెరికాలోని ఒహియో అనే ప్రాంతంలోనైతే మహిళలు పురుషులపై రేప్ చేయడం చాలా ఎక్కువైపోయింది. మారణాయుధాలతో బెదిరించి మరి అత్యాచారానికి పాల్పడుతున్నారట. ఇలాంటి రివర్స్ రేప్ గురించి లండన్ లోని ఓ యూనివర్సిటి పరిశోధన మొదలుపెట్టింది. షాకింగ్ విషయం ఏంటంటే.. మగవారిపై జరిగే లైంగిక దాడులు ఎక్కువగా రికార్డుల్లోకి ఎక్కడం లేదట. ఈ విషయంపై ల్యాన్కేస్టార్ యూనివర్సిటికి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ “ఇలాంటి కేసులు తక్కువే అయినా, మగవారిపై కూడా మానభంగాలు జరుగుతున్నాయి. మహిళలే ఇలాంటి పనులు చేస్తున్నారు.

కాని సమాజంలో ఉన్న ఒక అపోహ ఏమిటంటే, ఇలాంటి దాడులని పురుషుడు ఆస్వాదిస్తాడు అంటారు. కాబట్టి దాన్ని రేప్ గా పరిగణించకూడదట. కొత్తగా ఫోర్సేడ్ టూ పెనట్రేట్ అని పేరు పెట్టి కఠిన శిక్షలు వేయడం లేదు. అదే పని మగవారు చేస్తే మాత్రం అందరు ఒక్కటై పోతారు కదా. తప్పు ఎవరిదైనా తప్పే. ఒక అందమైన మగవాడిని చూస్తే స్త్రీలకు కామం పుట్టదా? పురుషుడికి బలం ఎక్కువ, కోపం ఎక్కువ, కాబట్టి రేప్ కాదు అంటున్నారు. ఇలాంటి వితండవాదంతోనే పురుషులపై రేప్ కేసులలో కేవలం 15% మాత్రమే బయటకి తెలుస్తున్నాయి.” అంటూ లండన్ మగవారి కష్టం గురించి వివరించారు.

https://www.youtube.com/watch?v=dbgNsZDjYtM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -