ప్రియురాలిపై ప్రేమ ఎక్కువుంటే రోజా పూలు ఒకటి రెండు కాకుండా ఓ గుత్తు ఇస్తారు. లేదంటే చాక్లెట్లు ఫుల్ ప్యాకెట్ ఇస్తారు. కాని అదేంటో అతడు ఆమెపై తన ఇష్టాన్ని చూపించుకున్నాడు అనే కంటే ఆమె బాధను చూడలేక ఇలాంటి పని చేశాడని చెప్పడం బెటర్.
అనారోగ్యంతో వర్రీ అవుతోన్న లవర్ హైహిల్స్ (ఎత్తైన) చెప్పులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. అది చూసి తట్టుకోలేని ఓ ప్రేమికుడు ఆమెకు తన చెప్పులను ఇచ్చాడు. ఆమె హైహిల్స్ తాను వేసుకున్నాడు. చైనాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెటిజన్ల మనస్సులను గెలుచుకుంది. చైనాలోని చాంగ్‌కింగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రేయసితో ఆస్పత్రికి వచ్చాడు. ఈ టైమ్లో అతను పింక్ కలర్ హై హీల్స్ వేసుకుంటే.. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆ సుందరి ప్రియుడు చెప్పులు వేసుకుంది. ఈ తతంగాన్ని ఓ మహిళ తన కెమెరా ఫోన్లో బంధించింది. ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతోన్న ఆమెను అతను పలుసార్లు వెన్నుతట్టి ధైర్యం చెప్పాడు.
ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టుచేసిన ‘గ్జీ’ అనే మహిళ చివరగా వారు ఆస్పత్రి నుంచి వెళ్లే సమయంలో విషయాన్ని మెసేజ్ రూపంలో ఆ పోస్ట్ లో పెట్టింది. అది ఏమిటంటే ప్రియురాలు నా చెప్పులు నేను వేసుకుంటానని చెప్పినా …ప్రియుడు ఒప్పుకోలేదని ఎలాంటి నామోషి లేకుండా బయటకు కూడా ఆమె చెప్పులతోనే వెళ్లాడని గ్జీ చెబుతుంది. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారి వీరి ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పాయి.