Friday, May 17, 2024
- Advertisement -

సోనియా- జగన్‌ల మధ్య విభజన నాటి ఒప్పందం అంటూ పచ్చ మీడియా పిచ్చ రాతలు

- Advertisement -

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి జనాల అవగాహన, తెలివితేటలపై మామూలు చులకన భావం ఉండదు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప విషయం చోటు చేసుకున్నా అందులో తన వాటా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాడు. తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని త్యాగం చేశానని చెప్తాడు. అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు చెయ్యొచ్చా? ప్రధానమంత్రి అయితే ఎక్కువ మేలు చెయ్యొచ్చా? కాస్త తెలివి ఉన్నవాళ్ళెవరైనా ప్రధానమంత్రి పదవే అని చెప్తారు. కానీ చంద్రబాబుది మాత్రం అంతా రివర్స్ వ్యవహారం. ఎందుకంటే అసలు ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది అన్నమాటే నిజం కాదు కాబట్టి.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఓ పచ్చ మీడియా సంస్థ విభజన నాడు సోనియా-జగన్‌ల మధ్య ఒప్పందం ఇది అంటూ పిచ్చి రాతలు రాసింది. అది కూడా కాంగ్రెస్ ఎంపి జేడీ శీలం మాటలను ప్రాతిపదికగా తీసుకుని ఇష్టారీతిన విశ్లేషణ చేసి పడేశారు. జగన్‌కి సోనియాకు మధ్య ఒప్పందం నిజం అనేలా రాశారు. జేడీ శీలం ఎప్పిటి నుంచో టిడిపిలో ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడన్నది పొలిటికల్ సర్కిల్‌లో అందరికీ తెలిసిన విషయం. తాజాగా ఆయనగారు బాబుని మెప్పించడం కోసం జగన్‌కి నష్టం చేసేలా ఓ మాట చెప్పాడు. ‘విభజన నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ…….ఆ విభజన నిర్ణయానికి అడ్డుపడకుండా ఉండేందుకుగాను జగన్‌తో ఒప్పందం చేసుకుందట. జగన్‌కి బెయిల్ ఇప్పిస్తానని సోనియా చెప్పిందట. అందుకు ప్రతిగా విభజన నిర్ణయానికి అడ్డుపడకూడదని జగన్‌తో ఒప్పందం చేసుకుందట’.

పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. అసలు విభజన టైం నాటికి జగన్‌కి విభజనకు అడ్డుపడేంత శక్తి ఉందా? పార్లమెంట్‌లో ఆ స్థాయిలో జగన్‌కి ఎంపిలు ఉన్నారు? రాస్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. అధికారంలో ఉన్నది చంద్రబాబు మద్దతుతో కొనసాగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. అలాంటప్పుడు ఏ బలమూ లేని జగన్ విభజనను ఎలా అడ్డుకుంటాడు? విభజనకు జగనే అడ్డు అని సోనియా ఎలా ఆలోచించింది?

సమాజాన్ని ఉద్ధరించడం కోసం అని పేరెట్టుకుని టిడిపికి మేలు చేయడం…..చంద్రబాబుకు కొరకరాని కొయ్యలా మారిన జగన్‌లాంటి వాళ్ళకు నష్టం చేయడానికి తప్ప వీళ్ళకు వేరే పని ఉండదు. కనీస స్థాయి కామన్‌సెన్స్ లేకుండా వార్తలు వండేస్తూ ఉంటారు. ఈ పచ్చ పిచ్చి వార్త కూడా అలాంటి కోవలోదే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఇక ఈ వార్తలోనే జగన్‌పై కక్ష్య సాధింపుకోసమే సోనియా కేసులు పెట్టించిందన్న అర్థం వస్తోంది. ఎందుకంటే సోనియా తల్చుకుంటే బెయిల్ వస్తుంది అని చెప్పారంటే…….జగన్‌ని జైలుకు పంపించింది కూడా అదే సినియానే అని ఒప్పుకుంటారా? అక్కడ మాత్రం మళ్ళీ జగన్ అవినీతి అని పాట పాడతారు., దటీజ్ పచ్చ జర్నలిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -