Friday, May 17, 2024
- Advertisement -

333-179… ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరోసారి ఇలా జరగదేమో..

- Advertisement -

 మళ్లీ అలాంటి ఫీట్లు జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్‌ గురించి అభిప్రాయపడుతున్నారు. ఓ వన్డేలో ఓడితే తర్వాతి వన్డేలో ప్రత్యర్థిపై రెండో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుంది. అందులో భాగంగా ఆ మరుసటి వన్డేలో నమోదైన గణాంకాలు మాత్రం క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి.

జింబాబ్వే స్టార్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ (125; 121 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో పాటు సికిందర్ రజా (92; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు గ్రేమ్ క్రీమర్ (4/41), చతారా (3/24)లు విజృంభించడంతో 30.1 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ జట్టులో రహ్మద్ షా (43), దౌలత్ జర్దాన్ (47 నాటౌట్) మాత్రమే ఆ జట్టు 154 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది.

తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేయగా, జింబాబ్వే జట్టు 179 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లనూ చేజార్చుకుని 154 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. అంతవరకూ ఓకే. 334 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 179 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇలా అన్ని అంశాలూ రిపీట్ కావడాన్ని క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

తొలి వన్డే:
అఫ్గానిస్తాన్‌: 333/5
జింబాబ్వే: 179 ఆలౌట్

రెండో వన్డే:
జింబాబ్వే: 333/5
అఫ్గానిస్తాన్‌: 179 ఆలౌట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -