ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు..ఇప్పటికి అయన ను ప్రజలు మర్చిపోలేదంటే అది అయన ప్రజలకోసం చేసిన సేవ అలాంటిది.. విద్య వైద్య రంగాల్లో అయన చేసిన సేవకి , ప్రజలకోసం చేసిన మేలు కి ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారని చెప్పొచ్చు.. తిరుగులేని పథకాలతో ప్రజల్లో నిలిచిపోయిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, యువతరానికి ఫీజు రీయంబెర్స్ మెంట్ వంటి పథకాల విషయంలో ఎంతో పారదర్శకత చూపించారు. తాజాగా జగన్ తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండడుగులు వేస్తాననే మాట నిలబెట్టుకునేలా సాగుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే విద్య, వైద్యం విషయంలో ఆయన ఉదారంగా వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. శాశ్వత ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పథకాలను సృష్టించి వాటిని అమలుపరిచే విషయాల్లో ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు.. జగన్ అంటే గిట్టని ప్రత్యర్థులు, కొన్ని పచ్చ పత్రికలకు అర్థం కాకపోవచ్చు గానీ అభివృద్ధి అంటే మానవవనరుల మీద పెట్టిన పెట్టుబడులనే విషయం ప్రపంచమంతటికీ తెలుసు. వాటికి మించిన పెట్టుబడి, అభివృద్ధి ఉండదనేది అందరూ అంగీకరించే సత్యం. సరిగ్గా ఇప్పుడు జగన్ అభివృద్ధి విషయంలో అక్కడే దృష్టి సారించారు.
రాబోయే కొన్ని దశాబ్దాల పాటు జగన్ తీసుకున్న నిర్ణయాలు నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. మిగితా విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ నిర్ణయాలు తన తండ్రిలా రాష్ట్రంలో పేరు నిలబడిపోయేలా ఉంటాయని తెలుస్తుంది.. ప్రభుత్వ బడుల్లోకి దాదాపుగా 3లక్షల మంది వచ్చి చేరారు. అంటూ ఆయా కుటుంబాల్లో కనీసం ఏడాదికి రూ. 25వేల ఆదాయం మిగిలినట్టే భావించాలి. ప్రైవేటు బడులకు ఫీజుల, ఇతర రూపాల్లో పెట్టాల్సిన ఖర్చు ప్రభుత్వ బడుల్లో చేర్చడం వల్ల ఆయా కుటుంబాలకు మిగిలుతాయనే చెప్పవచ్చు. ఇలా విద్య విషయంలో, వైద్యం విషయంలో జగన్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. తద్వారా జగన్ జన హృదయాల్లో నిలిచిపోయేందుకు ఇవన్నీ ఉపయోగపడే అంశాలనేనని చెప్పవచ్చు.
చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?
జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండదు..?
సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!