గంప‌గుత్త‌గా చిన్న‌ సినిమాలు

- Advertisement -

రెండు రోజుల్లో డ‌జ‌న్ సినిమాలు
గురు, శుక్ర‌వారాల్లో 12 సినిమాలు విడుద‌ల‌

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో న‌వంబ‌ర్ నెల‌లో విడుద‌లైన‌న్నీ సినిమాలు ఎప్పుడూ విడుద‌ల కాలేదు. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి డిసెంబ‌ర్ రెండో వారంలో క‌నిపిస్తోంది. ఈసారి ఏకంగా డ‌జ‌న్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఒకేసారి పోలోమ‌ని గురు, శుక్ర‌వారాల్లో చిన్న సినిమాల‌న్నీ విడుద‌ల అవుతున్నాయి. ఆ మేర‌కు ఆ సినిమా బృందాలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీరంద‌రూ ఒకేసారి థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు విసుగొస్తోంది. ఏంటీ సినిమాలు అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రైన ప్లానింగ్ లేకుండా వ‌చ్చి వెళ్లిపోతే సినిమాకు ఏం ప్ర‌యోజ‌నం ఉండ‌దు.. ప్రేక్ష‌కుల‌కు ఇబ్బందిగా ఉంటుంది. గుంపులో గోవింద‌గా వ‌చ్చిపోతే సినిమా విడుద‌ల‌య్యిందా అని ప్ర‌శ్నించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

- Advertisement -

ప్ర‌స్తుత‌మైతే డిసెంబ‌ర్ 14, 15 తేదీల్లో 12 సినిమాలు వ‌స్తున్నాయి. వీటిలో 14వ తేదీ గురువారం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ కాగా, మరోటి ‘ప్రాజెక్ట్ జెడ్’ సినిమాలు వ‌స్తున్నాయి. యాంకర్ జయతి స్వీయ నిర్మాణంలో నటించిన ‘లచ్చి’, యాంకర్ రవి సినిమా ‘ఇది మా ప్రేమకథ’, న‌వీన్‌చంద్ర‌, నివేథా థామ‌స్ న‌టించిన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, కుటుంబ కథా చిత్రమ్, ఉందా లేదా, తొలి పరిచయం, సీత రాముని కోసం, మామ ఓ చందమామ, ప్రేమ పందెం, మరో దృశ్యం, పడిపోయా నీ మాయలో.. వంటి సినిమాలు శుక్రవారం విడుదల అవుతున్నాయి.

వీటిలో న‌వీన్‌చంద్ర‌, నివేథా థామ‌స్ న‌టించిన జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్‌, బుల్లితెర యాంక‌ర్ ర‌వి న‌టించిన ఇది మా ప్రేమ‌క‌థ‌, ఇంకా నందు, యాంక‌ర్ శ్రీముఖి న‌టించిన కుటుంబ క‌థా చిత్ర‌మ్ త‌దిత‌ర సినిమాలు కొంచెం చెప్పుకోద‌గ్గ సినిమాలు.ఈ విధంగా గంప‌గుత్త‌గా సినిమాలు విడుద‌ల చేస్తే ఎవ‌రికీ ఏం ప్ర‌యోజ‌నం ఉండ‌దు. దీనిపై ఎవ‌రైనా చ‌ర్య‌లు తీసుకుంటే థియేట‌ర్ల‌కు, ప్రేక్ష‌కుల‌కు, సినిమాల‌కు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -