Tuesday, May 21, 2024
- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్ తో స్మిత్ జీవితం ఎలా త‌ల‌క్రిందులైందో ఈఫోటో చూడండి

- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్ వివాదం క్రీడారంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. విజ‌యం కోసం క్రీడాస్పూర్తిని మ‌ర‌చి వార్న‌ర్‌, స్మిత్ ప్ర‌వ‌ర్తించ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారిమీద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. వారిద్ద‌రిని ఏడాది పాటు క్రికెట్ ఆడ‌కుండా నిషేధం విధించింది. దీంతో వారు విలువైన క్రీడా జీవితాన్ని కోల్పోవ‌డంతోపాటు వారి జీవితాంతం చేసిన త‌ప్పు వెంటాడుతూనే ఉంటుంది. చేసిన త‌ప్పు వ‌ల్ల ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో స్మిత్తే ఉదాహ‌ర‌ణ‌.

దక్షిణాఫ్రికాతో క్రికెట్ ఆడుతూ విజయం కోసం అడ్డదారులు తొక్కి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన స్టీవ్ స్మిత్ కెరీర్ తల్లకిందులైంది. ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా నిలుస్తోంది. కొంతకాలం క్రితం స్మిత్ తన స్వీయ కథను స్వయంగా రచించి, దానికి ‘ది జర్నీ స్టీవ్ స్మిత్’ అని పేరు పెట్టగా విశేషమైన స్పందన వచ్చింది.

దీని ధరను 24 డాలర్లుగా నిర్వహించగా, హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ప్రస్తుత పరిణామాలతో ఈ పుస్తకాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా, క్లియరెన్స్ సేల్ పేరిట ఓ బుక్ షాప్ కేవలం 2 డాలర్లకే పుస్తకాన్ని ఇస్తామని ప్రకటిస్తూ తన షాపు ముందు బోర్డులు పెట్టింది. ఈ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 90 శాతం తగ్గింపు ధరకు బుక్ విక్రయిస్తామన్నా ఎవరూ కొనుగోలు చేయడం లేదని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -