Friday, May 17, 2024
- Advertisement -

రంగస్థలం రామ్ చరణ్ రివ్యూ……. నటుడిగా ప్రూవ్ చేసుకున్న చరణ్

- Advertisement -

ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన సినిమాలతో సహా ఏవీ కూడా ఆ బాలగోపాలాన్ని ఆకట్టుకునే స్థాయి హిట్స్ కాలేదు. హిట్టయిన సినిమాలు కూడా ఏదో నాంకే వాస్తే అనిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రెజు రిలీజ్ అయిన రంగస్థలంపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. రంగస్థలం సినిమాకు సంబంధించి ఫస్ట్ రిపోర్ట్స్ కొన్ని వస్తున్నాయి.

ఊరిలో ఉండే జనాల పొలాలకు నీళ్ళు పారించే మోటార్ల విషయంలో చరణ్ సాయం చేస్తూ ఉంటాడు. ఆ ఊరికి దశాబ్ధాలుగా ఉన్న సర్పంచ్ జగపతి బాబు. ఇక అదే ఊరిలో ఉన్న రామలక్ష్మిని చూసి చరణ్ ఇష్టపడతాడు. ఆ తర్వాత ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయిన రామ్ చరణ్ అన్న ఆది చాలా కాలం తర్వాత ఊరికి వస్తాడు. కాస్త చదువుకున్నవాడైన ఆది ఆ ఊరి సర్పంచ్ జగపతి బాబు మనుషులను ఎదిరిస్తాడు. జగపతిబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడతాడు. ఆ తర్వాత పరిణామాలేంటి? ఎవరు గెలిచారు? అనేది కథ.

అయితే మొత్తం సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కనపెడితే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌కి మాత్రం చాలా ప్రశంశలే దక్కుతున్నాయి. ఇప్పటి వరకూ నటుడిగా ప్రూవ్ చేసుకోవడంలో ఎప్పుడూ కూడా బ్లాక్ బస్టర్ మార్కులు తెచ్చుకోలేకపోయిన చరణ్…….ఈ సినిమాతో డిస్టింక్షన్ మార్క్స్ కొట్టేశాడు. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించిన చరణ్ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. అన్ని ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక రామలక్ష్మిగా సమంతా కూడా తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. అన్నింటికీ మించి అనసూయ ప్లే చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌కి కూడా మంచి ప్రశంశలే దక్కుతున్నాయి. మొత్తంగా చూస్తే రంగస్థలం సినిమాకు సంబంధించి నటీనటులు అందరికీ మాత్రం చాలా మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. రామ్ చరణ్‌ నటన అద్భుతంగా ఉందన్న ప్రశంశలు అన్ని వైపుల నుంచీ వినిపిస్తున్నాయి.

మొత్తం సినిమా రివ్యూ మరి కాసేపట్లో…….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -