Tuesday, May 14, 2024
- Advertisement -

స్మిత్, వార్నర్ కి బాల్ ట్యాంప‌రింగ్ చేయ‌డం కొత్తేమికాదు…అంపైర్ డరైల్ హార్పర్

- Advertisement -

అంతా అనుకున్నట్టే ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన యువ ఆటగాడు కామెరాన్‌ బెన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విదిస్తూ చర్యలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

బాల్ ట్యాంప‌రింగ్ వివాదంపై మాజీ అంపైర్ డరైల్ హార్పర్ స్పందించాడు. నిషేధానికి గురిఅయిన స్టీవెన్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్ లు బంతి ఆకారాన్ని దెబ్బ తీయడం అలవాటేనని మాజీ అంపైర్ డరైల్ హార్పర్ పేర్కొన్నాడు.స్మిత్, వార్నర్ లు దేశవాళీ క్రికెట్ లో కూడా టాంపరింగ్ కు పాల్పడ్డారని చెప్పాడు. 2016లో ఆసీస్ దేశవాళీ మ్యాచ్ లకు తాను రిఫరీగా పని చేశానని ఆయన తెలిపాడు.

ఆ టోర్నీలో స్మిత్, వార్నర్ లు న్యూసౌత్‌ వేల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని చెప్పాడు. ఆ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో వాళ్లిద్దరూ బంతి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారని, దీనిని తాను అప్పుడే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌, రిఫరీ సైమన్‌ టౌఫెల్‌ కు ఈమెయిల్‌ కూడా పంపానని ఆయన తెలిపాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో స్మిత్‌, వార్నర్‌ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారన్న వార్త తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన స్పష్టం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -