వన్డే ప్రపంచకప్‌లో పసికూన ఆఫ్ఘానిస్తాన్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లను మట్టి కరిపించిన ఆప్ఘాన్ తాజాగా శ్రీలంకను చిత్తు చేసింది. ఇక ఆప్ఠాన్ ఓడించిన మూడు టీంలు పెద్ద టీంలే కావడం విశేషం. సోమవరం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లంక విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 242 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో శ్రీలంక గెలిచింది.
అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (73) నాటౌట్ రాణించగా రహ్మత్ షా (62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58 )తో రాణించడంతో ఆప్ఘాన్ విజయం ఖాయమైంది. లంక బౌలర్లలో మధుషనక 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (46) ,కెప్టెన్ కుషాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ (36) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో లంకకు ఓటమి తప్పలేదు. ఫజల్‌హక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరాజయాలు (43) మూటగట్టుకున్న జట్టుగా లంక రికార్డుల్లోకి ఎక్కింది.