Monday, May 6, 2024
- Advertisement -

ఉమెన్స్ హాస్టల్‌లో 40మందిపై అత్యాచారం

- Advertisement -

భార‌త‌దేశంలో రోజు రోజుకి అత్యాచార ఘ‌ట‌న‌లు ఎక్క‌వు అవుతున్నాయి.తాజాగా బిహార్ రాష్ట్రంలో ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉన్న 40 మందికి పైగా యువతులపై అత్యాచారం జరిగిందని, ఒక అమ్మాయిని కొట్టి చంపేసి పాతిపెట్టేశారని వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇందులో 21 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 16 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన వారి వైద్య ప‌రిక్ష‌లు తెలియాల్సి ఉంది.

త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని ఒక అమ్మాయిని కొట్టి చంపారని, వసతి గృహం ఆవరణలోనే మృతదేహాన్ని పాతిపెట్టారని తోటి అమ్మాయి ఫిర్యాదు చేసింది. హాస్టల్ నిర్వాహకుడు ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌కు సన్నిహితుడని అందుకే అత‌నిని నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడి అమ్మాయిలపై అత్యాచారం చేస్తున్నారని పలువురికి గర్భస్రావం కూడా చేయించారని స‌మాచారం.మ‌రి దీనిపై బిహార్ ప్ర‌భుత్వం ఎలాంటి చర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=6SRTDD15uDg

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -