Saturday, May 4, 2024
- Advertisement -

కోహ్లీని ప్రేమించానన్న మహిళా క్రికెటర్ తో సచిన్ కుమారుడు అర్జున్ లంచ్‌ డేట్‌..

- Advertisement -

మాస్టర్ బ్లాస్టర్ స‌చిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో సరదాగా గడుపుతున్నాడు. శ్రీలంకతో యూత్ వన్డే సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విరామంలో లండన్ వెళ్లి తన స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు.

ఈ క్రమంలో ఇంగ్లిష్ విమెన్ క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేశాడు అర్జున్. అమె ఎవ‌రో కాదు గతంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించానని చెబుతూ, ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ట్వీట్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ గుర్తుందా? ఇప్పుడామెతో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లంచ్ డేట్ లో కనిపించి చిన్న సైజు కొత్త చర్చకు తెరలేపాడు.

డేనియల్‌తో కలిసి ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌కు వెళ్లిన జూనియర్ టెండూల్కర్.. ఆ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డేనియల్ కూడా ఇదే ఫొటోను అభిమానులతో పంచుకుంది

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిన అర్జున్, వ్యాట్ లు కలసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న స్నేహం ఎంతవరకూ వెళ్లిందోనంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -