గాయం కారణంగా తొలి టెస్ట్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మూడో టెస్ట్ కు కూడా దూరమయ్యారు. దీంతో ఇంగ్లండ్ కు నిరాశే మిగిలింది. ఈ నెల 22 నుంచి హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 12 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. ఈ జాబితాలో అండర్సన్ పేరు లేదు. ఫిట్ నెస్ లేకపోవడంతోనె అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని భావించినట్లు ఈసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు.
అండర్సన్ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న జోఫ్రా ఆర్చర్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. దీంతో మూడో టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేశారు. హెడింగ్లీ టెస్టులో ఇంగ్లండ్ బౌలింగ్ దళానికి ఆర్చర్ నాయకత్వం వహించనున్నాడు.ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. ఇన్నింగ్స్‌కు ఒకరిద్దరూ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది.
