Friday, May 10, 2024
- Advertisement -

కోహ్లి ప్లేస్‌కి ఎర్త్ పెట్టిన రోహిత్ శ‌ర్మ‌

- Advertisement -

ఆసియాకప్‌కు టీఇండియా రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవ‌డంతో తాత్క‌లిక కెప్టెన్ ఎంపిక అయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. ఆసియాక‌ప్ ఇండియా అద‌ర‌గొట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా క‌ప్‌ని గెలుచుకుంది. ఆసియాకప్ గెల‌వ‌డంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క పాత్ర పోషించాడు. ఆసియా క‌ప్ ఫైన‌ల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి క‌ప్‌ను అందుకుంది భార‌త్‌.

ఆసియాకప్‌ టైటిల్‌ అందించిన రోహిత్‌ శర్మ పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. తన కెప్టెన్సీ అచ్చు ధోనిలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దమేనా అని అడిగిన ప్రశ్నకు రోహిత్‌ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ‘మాకు కేవలం గెలుపే కావాలి. కెప్టెన్సీ అవకాశం వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాను. అని తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -