Friday, May 10, 2024
- Advertisement -

ధోనీ డ‌కౌట్‌….అవేశంతో ఊగిపోయిన బుడ్డ అభిమాని

- Advertisement -

ఆసియా క‌ప్‌లో భాగంగా నిన్న రాత్రి దుబాయ్ లో ఆసియా కప్ లో భాగంగా పసికూన హాంకాంగ్ పై నానా తంటాలు పడి భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఓట‌మి అంచుల‌కు వెల్లిన టీమిండియాను బౌల‌ర్లు విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అయితే ఈ మ్యాచ్‌లో అనుకోని సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ డక్కౌటైన సమయంలో కనిపించిన ఓ దృశ్యం ఇప్పడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ధోని అంటే ఎంతో అభిమానుం ఉన్న ఆ బాలుడు డకౌట్ అవ‌డంతో చూపించిన ఆగ్రహం, అసహనం అందిరికి నవ్వు తెప్పిస్తోంది. జట్టు స్కోరు 240 వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (127: 120 బంతుల్లో 15×4, 2×6) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ.. హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గత ఏడాది కాలంగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఎక్కువగా ధోనీ వికెట్ చేజార్చుకుంటున్న విషయం తెలిసిందే.

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పాయింట్ దిశగా నెట్టేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ స్కాట్ చేతుల్లో పడింది. స్టేడియంలో ఉన్న బుడ్డోడు తన ఆరాధ్య క్రికెటర్ ఔటవడంతో గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న కుర్చీలను విరగొట్టేందుకు ప్రయత్నించాడు. బాలుడి అసహనం వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాలుడు ‘టీమిండియా జెర్సీ నెం.7’ ధరించి ఉండటంతో.. అతను ధోనీకి వీరాభిమాని అని స్పష్టంగా తెలుస్తోంది.

https://twitter.com/iconicdeepak/status/1042069264931405825

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -