Thursday, May 9, 2024
- Advertisement -

భార‌త్‌కు చుక్క‌లు చూపించిన ప‌సికూన హాంకాంగ్‌..

- Advertisement -

ఆసియా క‌ప్‌లో భార‌త్‌కు చుక్కులు చూపించింది ప‌సికూన హాంకాంగ్‌. ప్రధాన ఆటగాళ్లను పక్కనబెట్టి బరిలోకి దిగితే, ఏం జరుగుతుందో చూపించింది. . 34 ఓవర్లపాటు భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దాదాపు పరాభవం ఖాయమనుకున్న దశ నుంచి పుంజుకుని బతుకుజీవుడా అంటూ గెలిచింది.

మంగళవారం మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆ జట్టు 285/7కు కట్టడి చేసింది. శిఖర్‌ ధావన్‌ (127; 120 బంతుల్లో 15×4, 2×6), అంబటి రాయుడు (60; 70 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ధావన్‌కు వన్డేల్లో ఇది 14వ శతకం. భారత్ 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.కేడీ షా(3/39), ఎహసాన్‌ఖాన్(2/65) ఆకట్టుకున్నారు. సెంచరీతో రాణించిన ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది

భారత్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యఛేదనలో హాంకాంగ్.. ఖలీల్ అహ్మద్(3/48), చాహల్(3/46), కుల్దీప్(2/42) ధాటికి 50 ఓవర్లలో 259/8 స్కోరు చేసింది. ఓపెనర్లు నిజాకత్ ఖాన్(115 బంతుల్లో 92, 12ఫోర్లు, సిక్స్), అన్షుమన్ రాత్(97 బంతుల్లో 73, 4ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు.

300 పైగా స్కోరు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. స్లాగ్ ఓవర్లలో వికెట్టు కోల్పోవడంతో భారత్ 285 పరుగులకే పరిమితమైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన హాంకాంగ్ అంచనాలకు మించి రాణించింది. కడదాకా పోరాడిన హాంకాంగ్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి.. విజయానికి 26 పరుగుల దూరంలో నిలిచింది.

హాంకాంగ్ దృష్టిలో ఇది కొండంత లక్ష్యమే. కానీ, హాంకాంగ్‌ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్‌ లు, భారత బౌలింగ్‌ ను సమర్థనీయంగా ఎదుర్కున్నారు. మ్యాచ్ లో గెలిచినంత పని చేశారు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ, నిజాకత్ 92, అన్షుమన్ 73 పరుగులు చేశారు. ఈ దశలో ఖలీల్‌ అహ్మద్‌ పేస్, కుల్దీప్, చహల్‌ ల మణికట్టు మాయాజాలం ఇండియా పరువును కాపాడాయి. వీరిద్దరి జోడీ విడిపోయిన తరువాత, హాంకాంగ్ అట్టేసేపు నిలవలేకపోయింది.

సెంచరీతో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓడిపోతామని భావించిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించేసరికి, అభిమానులు బతుకుజీవుడా అని అనుకున్నారు. నేడు భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో గ్రూప్ దశలో రెండో మ్యాచ్ ఆడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -