ప్రియురాలితో డిన్నర్ లో తలుక్కు మన్న ఇండియా క్రికెటర్ రాహుల్…

- Advertisement -

క్రికెటర్లకు, బాలావుడ్ భామలకు ఉన్న రిలేషన్స్ సర్వసాధారణం. హీరోయన్ లతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం అంతలోనె విడిపోవడం క్రికెటర్లకు అలవాటె. ఇక రాహుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బాలీవుడ్ నటి ఆథియా శెట్టితో రాహుల్ డిన్నర్ లో తలుక్కు మన్నారు. ఇద్దరూ కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆథియా స్నేహితురాలు ఆకాంక్ష రంజన్ బర్త్‌డే పార్టీకి కూడా రాహుల్ వెళ్లాడు. అక్కడ దిగిన ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. కాగా.. నిన్న రాత్రి ముంబయిలోని ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసేందుకు ఆథియా, రాహుల్ వెళ్లారు. డిన్నర్ ముగించుకుని ఇద్దరూ కలిసి బయటికి వస్తుండగా మీడియా వారి ఫొటోలు క్లిక్‌మనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ గబగబా ఒకే కారులో వెళ్లిపోయారు.

- Advertisement -

ఆథియా ప్రేమలో ఉన్నారని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత విక్రమ్ ఫడ్నిస్ వెల్లడించారు. ఆథియా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఆయన స్పందిస్తూ.. ‘ఏంటి ఆథియా ఈ మధ్య నువ్వు హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ వద్దకు వెళదామా? అదే కౌలాలంపూర్’ అని వెటకారంగా అన్నాడు. దాంతో ఆథియాకు కోపం వచ్చింది. ‘నిన్న బ్లాక్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని సమాధానమిచ్చింది.గతంలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ లతో రాహుల్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -