Friday, March 29, 2024
- Advertisement -

భారత్‌ 323 డిక్లేర్డ్‌… సఫారీల లక్ష్యం 395..మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

- Advertisement -

విశాఖ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ రెండో ఇన్నీంగ్స్ ను 323/4 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో సఫారీలకు 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.ఓపెనర్ రోహిత్ శర్మ (127: 149 బంతుల్లో 10×4, 7×6) శతకానికి చతేశ్వర్ పుజారా (81: 148 బంతుల్లో 13×4, 2×6) మెరుపులు తోడవడంతో రెండో ఇన్నింగ్స్‌ని టీమిండియా 323/4తో ఈరోజు డిక్లేర్ చేసింది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. తమ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌కు ఓవరాల్‌గా 394 పరుగుల ఆధిక్యం లభించింది.రోహిత్‌ శర్మ(127) సెంచరీ సాధించగా, పుజారా(81) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. రవీంద్ర జడేజా(40), విరాట్‌ కోహ్లి(31 నాటౌట్‌), రహానే(27 నాటౌట్‌)లు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు.

అంతకుముందు 385/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాల్గో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో 46 పరుగులు జోడించిన తర్వాత మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.ఈరోజు చివరి సెషన్‌ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో విరాట్ కోహ్లీ.. భారత్ రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు.

రెండో ఇన్నీంగ్స్ ను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనె ఎదురు దెబ్బతగిలింది. మొదటి ఇన్నీంగ్స్ లో సెంచరీ చేసిన ఎల్గర్ జడేజా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. జడేజా వేసిన బంతికి ఎల్బీడబ్యూగా వెనుతిరిగాడు. మొదట నాటౌట్ ఇచ్చిన అంపైర్..తర్వాత కోహ్లీ రివ్యూకు వెల్లారు. రివ్యూలో బాల్ వికెట్లను తగలడంతో ఎల్గర్ నిరాశగా గ్రౌండ్ ను వీడారు. క్రీజ్ లో మార్కరమ్ (3), డెబ్రుయిన్ (5) పరుగులతో ఉన్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 11/1 ఉంది. ఇంకా 384 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -