Tuesday, May 14, 2024
- Advertisement -

స్మిత్, వార్నర్ బ్యాటింగ్ చూసేది అసాధ్యమే….

- Advertisement -

సమకాలీన క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ల కెరీర్ ఇక ముగిసినట్టేనా? అవుననే అంటున్నాయి ఆస్ట్రేలియా మీడియా సంస్థలు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, ఆటలో ఏ విధమైన మోసం చేసినా జీవితకాల నిషేధాన్ని అనుభవించాల్సిందే. తాము బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డామని చెప్పడంతో పాటు, ఆ పని తెలిసే చేశామని, అది డ్రస్సింగ్ రూమ్ నిర్ణయమని మీడియా ముందు అంగీకరించిన స్మిత్, వార్నర్ లపై జీవితకాల నిషేధం తప్పదని, ఈ మేరకు నేడో, రేపో సంచలన నిర్ణయం వెలువడుతుందని సమాచారం.

ఇక బాల్ ట్యాంపరింగ్ తప్పని తెలిసి కూడా అనుమతించిన కోచ్ డారెన్ లీమన్ పైనా చర్యలు తప్పవని తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, వారిద్దరూ ఇక బ్యాటింగ్ చేసేది అసాధ్యమేనని తెలుస్తోంది.

క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో తొలి వికెట్లు పడ్డాయి. మోసానికి నాయకత్వం వహించిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఉపసారథి డేవిడ్‌ వార్నర్‌లను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. జెంటిల్మన్‌ క్రీడ ప్రతిష్ఠను మంటగలిపిన వాళ్లిద్దరినీ వెంటనే తప్పించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ ఓ టేపుతో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్‌ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని స్మిత్‌ అంగీకరించడం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌కారం మోసానికి పాల్ప‌డ్బ‌వాళ్ల‌ను క్రికెట్ ఆడ‌కుండా జీవిత‌కాలం నిషేధించ‌వ‌చ్చును.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -