Monday, May 6, 2024
- Advertisement -

క్రికెట్ ఆస్ట్రేలియాకు మ‌రో బిగ్‌షాక్‌…

- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్ వివాదంతో క్రికెట్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌ల ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఇప్పటికే పరువు పోగుట్టుకుని ప్రపంచం ముందు చిన్నబోయిన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మరో షాక్‌ తగిలింది. ఏడాది కాలంగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అతిపెద్ద స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మెగెల్లాన్‌ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియాతో ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

2017లో మెగెల్లాన్‌ భారీ మెత్తం (20 మిలియన్ల ఆసీస్‌ డాలర్లు) చెల్లించి సీఏతో మూడేళ్లపాటు కొనసాగేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌తో ఒప్పందానికకి శ్రీకారం చుట్టిన మెగెల్లాన్‌.. అతి కొద్ది కాలంలోనే సీఏతో ఒప్పందానికి ముగింపు పలికింది. ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -