Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్నిక‌ల బ‌రిలో బంగ్లా కెప్టెన్‌…..

- Advertisement -

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్‌ ఆరంభించబోతున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో మొర్తజా పోటీచేయనున్నారు. బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో మొర్తజా పోటీ చేస్తున్నట్లు సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు.

క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మొర్తజాకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అధికార పార్టీ అయిన అవామీ లీగ్‌ తరుపునే మొర్తజా బరిలోకి దిగుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. మొర్తజా తన సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -