Sunday, May 12, 2024
- Advertisement -

రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై క్లారిటీ ఇచ్చిన బంగ్లా కెప్టెన్‌..

- Advertisement -

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మష్రఫే మోర్తజా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆదేశ జట్టు వన్డే కెప్టెన్‌గా కొనసాగుతోన్న మష్రఫే మోర్తజా రాజకీయల్లోకి కూడా అరంగేట్రం చేశాడు. ఇందులో భాగంగా బంగ్లా అధికార పార్టీ అవామీ లీగ్‌ తరఫున వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అతడు పోటీ చేయనున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

త‌న రాజ‌కీయ ఆరంగ్రేటంపై మష్రఫే మోర్తజా క్లారిటీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో 11వ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన అవామీ లీగ్ తరఫునే మొర్తజా బరిలోకి దిగనున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని షేక్ హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 30న ఆదేశ పార్లమెంట్‌కు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు.

సొంతూరు నరైల్ నియోజకవర్గం నుంచి ఆవామీ లీగ్ పార్టీ నుంచి పోటీచేయబోతున్నట్లు ప్రకటించాడు. మొర్తాజా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆదేశ క్రికెట్లో రాక్‌స్టార్ హోదా పొందిన అతనికి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు, భవిష్యత్ క్రికెట్ కెరీర్‌పై ఫేస్‌బుక్‌లో లేఖను పోస్ట్ చేశాడు

ఇదిలా ఉంటే అతని అభిమానుల్లో మాత్రం రాజకీయ అరంగ్రేటం గురించి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ‘నా నిర్ణయం తప్పైనా కావొచ్చు. కానీ, అతను రాజకీయాల్లోకి రావడమనే విషయాన్ని నేను స్వగతించను’ అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. మోర్తజా ఇప్పటికే తన టీ20 కెరీర్‌కు వీడ్కోలు చెప్పి టెస్టు క్రికెట్‌కు సైతం 2009 నుంచి దూరంగానే ఉంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -