Sunday, May 4, 2025
- Advertisement -

సత్తా చాటిన యువ ఆటగాళ్లు..బీసీసీఐ అవార్డుల జాబితా

- Advertisement -

హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జిరగింది. 2019 తర్వాత బీసీసీఐ తొలిసారి అవార్డులు అందించింది. భారత టెస్టు ఆటగాళ్లంతా ఈ ఈవెంట్‌కు హాజరు కాగా కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం పాల్గొన్నారు. గిల్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు(2022-23) దక్కగా ఫరూక్ ఇంజనీర్, రవిశాస్త్రిలకు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది.

అవార్డు విజేతల జాబితా ఇదే..

()శుభ్‌మ‌న్ గిల్ – క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2022-23)
()జస్ప్రీత్ బుమ్రా – క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2021-22)
()రవిచంద్రన్ అశ్విన్ – క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2020-21)
()మహ్మద్ షమీ – క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2019-20)
()ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- యశస్వి జైస్వాల్ (2022-23)
()ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- శ్రేయాస్ అయ్యర్ (2021-22)
()ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం – అక్షర్ పటేల్ (2020-21)
()ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- మయాంక్ అగర్వాల్ (2019-20)

దీంతో పాటు రంజీ ట్రోఫీ, దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్, మహిళా క్రికెటర్లకు అవార్డులు ప్రకటించారు. దిలీప్ సర్దేశాయ్ అవార్డు (ఇండియా-వెస్టిండీస్ 2023 సిరీస్) కు గానూ 2022-23లో అత్యధిక టెస్టు వికెట్లు : రవిచంద్రన్ అశ్విన్, 2022-23 అత్యధిక టెస్టు పరుగులు : యశస్వి జైస్వాల్ అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డుకు 2019-20 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : మహ్మద్ షమీ,2020-21లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : రవిచంద్రన్ అశ్విన్,ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : జస్ప్రీత్ బుమ్రా అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -