Thursday, April 18, 2024
- Advertisement -

భువిని ఊరిస్తున్న రికార్డ్..!

- Advertisement -

టీమిండియా యువ పెసర్ భూవనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెరియర్ మొదటి నుండి కూడా బాల్ కు రెండు వైపులా స్వింగ్ చేస్తూ బౌలింగ్ లో వైవిద్యం చూపడమే కాకుండా భారీగా వికెట్లు కూడా రాబట్టుకుంటూ టీమిండియా బౌలర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తడబడ్డ భువి ప్రస్తుతం లయ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఇటీవల దక్షణాఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో అద్బుతంగా రాణించిన భువి.. ఆ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అంతే కాకుండా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ప్రస్తుతం భువి ఒక అరుదైన రికార్డ్ కు చేరువలో ఉన్నాడు. టి20 మ్యాచ్ లలో పవర్ ప్లేలో అత్యాదిక వికెట్లు తీసిన వారిలో భువి ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్ శ్యాముల్ బద్రి 50 ఇన్నింగ్స్ ల్లో 33 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా, భువి 59 ఇన్నింగ్స్ ల్లో 33 వికెట్లు తీసి రెండవ స్థానంలో ఉన్నాడు.

ఇక న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌధి 68 ఇన్నింగ్స్ ల్లో 33 వికెట్లు తీసి మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ ముగ్గురు కూడా 33 వికెట్లు తీయడం గమనార్హం. అయితే ఇవాళ దక్షణాఫ్రికాతో జరగబోయే టి20 మ్యాచ్ లో భువి మరిన్ని వికెట్లు పవర్ ప్లే లో తీస్తే మాత్రం పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. మరి భ్వనేశ్వర్ కుమార్ ఈ రికార్డ్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -