Saturday, April 27, 2024
- Advertisement -

పంత్ తీరు మారేనా ..?

- Advertisement -

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ అద్బుతమైన ఆటగాడు అన్న సంగతి అందరికీ తెలుసు. అతను ఫామ్ లో ఉంటే నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే పంత్ వికెట్ల దగ్గర కూడా అంతే చురుకైన కీపర్ గా పేరు తెచ్చుకున్నాడు. వన్డే లైనా, టెస్టులైనా, టి20 లైనా.. ఇన్నింగ్స్ ఏదైనా తనదైన బ్యాటింగ్ స్కిల్స్ తో అద్బుతంగా రాణిస్తాడు పంత్. అయితే ఊహించని రీతిలో ప్రస్తుతం టీమిండియా టి20 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్ కాస్త తడబాటుకు గురి కావడం అందరినీ నిరాశకు గురి చేస్తోంది.

స్వదేశంలో దక్షణాఫ్రికాతో జరుగుతున్నా టీ20 మ్యాచ్ లకు అనుహ్యాంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వడం.. అదే సమయంలో వైస్ కెప్టెన్ కే‌ఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ భాద్యతలు చేపట్టక తప్పలేదు. అయితే కెప్టెన్ గా జట్టును పంత్ కు కొత్తేమీ కాదు.. గత ఏడాది డిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించి అద్భుతమైన విజయాలతో జట్టును ముందుండి నడిపించాడు. కానీ ప్రస్తుతం దక్షణాఫ్రికా తో జరుగుతున్నా టీ20 సిరీస్ లో మాత్రం పంత్ కెప్టెన్ గా విఫలం అవుతున్నాడనే చెప్పవచ్చు. డిల్లీలో జరిగిన ఫస్ట్ టీ20 లో భారత్ 211 భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ, ఆ స్కోర్ నిలబెట్టుకోలేక ప్రత్యర్థి జట్టుకు మ్యాచ్ ను సమర్పించుకుంది. ముఖ్యంగా భౌలింగ్ కూర్పులో పంత్ తడబాటుకు గురి అవుతున్నాడనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

అలాగే రెండవ టి20 లో కూడా పంత్ కెప్టెన్సీ లో ఏ మాత్రం చురుకుదనం కనిపించకపోవడం తో ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమి చవి చూసింది. అయితే పంత్ కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం లో విఫలం అవుతున్నాడని అర్థమౌతుంది. ఇదే విషయాన్ని మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా స్పష్టం చేశాడు..పంత్ కీలక సమయాల్లో కాస్త ఒత్తిడికి లోనవుతున్నాడని అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని జాఫర్ వ్యాఖ్యానించాడు. మరి ఇప్పటికే రెండు టి20 మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన సౌతాఫ్రిక ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలో మూడవ టి20 మ్యాచ్ వైజాగ్ వేదికగా నేడు జరగనుంది.. మరి నేటి మ్యాచ్ లోనైనా పంత్ కెప్టెన్ గా నిరూపించుకొని విమర్శలకు చెక్ పెడతాడా ? లేక గత మ్యాచ్ ల మాదిరిగానే పంత్ కెప్టెన్ గా విఫలం అవుతాడా ? అనేది చూడాలి.

Also Read : భువిని ఊరిస్తున్న రికార్డ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -