Friday, April 19, 2024
- Advertisement -

ఇక చంద్రబాబు పనైపోయిందా ?

- Advertisement -

రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం, రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అపార చాణక్యుడిగా బిరుదు గాంచాడు, దాదాపు నలబై ఏళ్ళు ఏ రాజకీయ నాయకుడికి లేనంత అపార అనుభవం, ఇది ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ట్రాక్ రికార్డ్. మరి ఇంతటి రాజకీయ మేటి నాయకుడు గత సార్వత్రిక ఎన్నికల్లో చవి చూసిన ఓటమి టిడిపి ఆవిర్భవించిన తరువాత కని విని ఎరుగని ఓటమి అనే చెప్పాలి. మరి ఇంతటి దారుణ ఓటమికి ముఖ్య కారణం చంద్రబాబు పరిపాలననే అనే విషయం కూడా అందరికీ తెలుసు.

కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపించాలంటే చంద్రబాబు ఒక్కడే సమర్థుడు అని నమ్మి ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో ఊహించని రీతిలో చంద్రబాబును గెలిపించారు. అయితే అధికరంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే సంగతి అలా ఉంచి, కనీసం ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక పోయాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలేన్ని? సక్రమంగా అమలు అయినవి ఎన్ని? అనే విషయం ఏపీ ప్రజలకు బాగా తెలుసు. సంక్షేమ పథకాల పేరుతో చంద్రబాబు జనాలను మోసం చెయ్యడంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా టిడిపి ని 23 సీట్లకే పరిమితం చేశారు ఏపీ ప్రజలు.

అయితే చంద్రబాబు ఇస్థాయిలో విఫలం కావడానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే అసంబద్ద నిర్ణయాలే కారణం. ఎందుకంటే చంద్రబాబు కొత్తలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలకు.. ప్రస్తుత రోజుల్లో తీసుకుంటున్న నిర్ణయాలకు చాలానే వ్యత్యాసం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికల తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోవడం, అవినీతి రాజకీయాలు చేస్తున్నాడనే ఆరోపణలు రావడం, ముఖ్యంగా ప్రజల నాడీ పట్టుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటివి చంద్రబాబు రాజకీయ చతురత గాడి తప్పింది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదనే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తే అపార చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు పని అయిపోయిందా ? అనే డౌట్ రాక మానదు.

Also Read

ఆపరేషన్ గుజరాత్ .. మోడీకి చెక్ ?

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -