Saturday, April 27, 2024
- Advertisement -

టాప్ ప్లేస్ లో బుమ్రా .. తాన సక్సస్ సీక్రెట్ అదే !

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. మొన్న ఇంగ్లండ్ తో జరిగిన టి20 సిరీస్ ను కైవసం చేసుకున్నా రోహిత్ సేన.. తాజాగా ప్రారంభమైన వన్డే సిరీస్ లో కూడా దూసుకుపోతుంది. వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బుమ్రా..ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో ఆగ్రస్థానలో నిలిచాడు. మొత్తంగా 718 పాయింట్లతో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఒకప్పుడు టీమిండియాల బౌలింగ్ విభాగం అత్యంత ఫెలవంగా ఉండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా సంగతి తెలిసిందే. అయితే భువనేశ్వర్, బుమ్రా వంటి వారి రాకతో టీమిండియా ఫేస్ విభాగం అత్యంత పటిష్టంగా మారింది.

ముఖ్యంగా బుమ్రా రాకతో టీమిండియాకు కొదువగా ఉన్న యార్కర్ బౌలింగ్.. మరింత బలంగా మారింది. ఇక బుమ్రా ఆరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకు కూడా కెరియర్ లో ఉత్తమ గణాంకాలనే నమోదు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ తో జరిగిన తాజా వన్డే మ్యాచ్ లో కేవలం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసి కెరియర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. అయితే ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం బుమ్రా తన సక్సస్ సీక్రెట్ బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ” క్రికెట్ విశ్లేషకులు చేసే ప్రశంశలకు.. విమర్శలకు తను రెస్పాండ్ అవ్వనని, చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్న తను మాత్రం స్టేబుల్ గానే ఉంటానని చెప్పుకొచ్చాడు. ఫార్మాట్ ఏదైనా గాని మ్యాచ్ ను ఆస్వాదించడమే తనకు తెలుసని, అందువల్ల కేవలం మ్యాచ్ పైనే ఫోకస్ చేస్తానని అదే తన సక్సస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -