Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నారా ?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గతంలో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీతో మళ్ళీ సత్సంబంధాలు పనిలో ఉన్నారు. గతంలో ఎన్నికల ముందు నరేంద్ర మోడిపై, అమిత్ షా పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చంద్రబాబు.. ఎన్నికల తరువాత సైలెంట్ అయిపోయారు. ఇక అప్పటి బీజేపీతో ఎడమొఖం పెదమొఖంగానే ఉంటూ వచ్చారు. అయితే తాజాగా మళ్ళీ బీజేపీ తో దగ్గరయెందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ఎన్డీయే కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల ఏపీలో పర్యటించారు.. .

ఈ పర్యటనలో భాగంగా ఆమె సి‌ఎం జగన్ను అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిసిన విషయం విధితమే. అయితే బీజేపీ నుంచి ఎలాంటి వినతి రాకుండానే చంద్రబాబు.. ద్రౌపది ముర్ము కు మద్దతు పలికారు. ఇక చంద్రబాబు తనంతట తానే బీజేపీ అభ్యర్థికి మద్దతు పలకడం కొత్త చర్చకు తావిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా విజయవాడలోని ఏపీ బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ లో ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు, సిఎం రమేశ్, మాధవ్, నారాయణ రెడ్డి వంటి వారు ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్న వైఖరి చూస్తుంటే.. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని గతంలో చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ ని లైట్ తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గత ఎన్నికల్లో టీడీపీ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు ప్రజలు..ఆ షాక్ నుంచి కోలుకొని బలపడడం అంతా ఈజీ కాదు. వచ్చే ఎన్నికల సమయానికి కూడా టీడీపీ బలపడుతుందా లేదా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు సాధారణంగా మాటమీద నిలబడడం చాలా అరుదు. అందువల్ల ఎన్నికల ముందు బీజేపీ ని తిట్టిన చంద్రబాబే మళ్ళీ ఎన్నికల కోసం బీజేపీ తో కలిసి నడవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

భారత్.. శ్రీలంక దేశంలా మారుతోందా ?

పవన్ కలవరం.. అందుకేనా ?

ఒకే దారిలో టీడీపీ, వైసీపీ .. అసలెందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -