నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. అందుకు సాక్ష్యాలు కూడా కంటికి కనిపిస్తున్నాయి. విదేశాల్లో అమ్మాయిలతో, మందుతో నారా లోకేష్ జల్సా జీవితం కంటికి కనిపిస్తూనే ఉంది. ఇక శేఖర్‌రెడ్డితో సహా ఇసుక నుంచీ నీళ్ళూ, భూముల వరకూ లోకేష్ అవినీతి కనిపిస్తూనే ఉంది. అయినా కూడా నిరూపించండి అంటూ తండ్రీ కొడుకులు ఇద్దరూ అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. మరి నరేంద్రమోడీకి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేశాడని చెప్పి చంద్రబాబు, లోకేష్, సిఎం రమేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రచ్చ రచ్చ చేశాయి. నిరూపిస్తే విజయసాయి రాజీనామా చేస్తాడా అని కూడా ఛాలెంజ్ విసిరారు.
విజయసాయిరెడ్డి ఛాలెంజ్‌కి రెడీ అన్నాడు. నరేంద్రమోడీకి పాదాభివందనం చేసినట్టుగా నిరూపిస్తే తన పదవి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. టిడిపి నేతల కంటే ముందు తానే పార్లమెంట్ ఫుటేజ్ బయటపెట్టండి అని పార్లమెంట్ సిబ్బందికి లేఖ రాశాడు కూడా. కానీ మోడీకి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేశాడు అని రెచ్చిపోయి మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, సిఎం రమేష్, సుజనా చౌదరి, ఆంధ్రజ్యోతి, ఈనాడులు మాత్రం ఆ మరుసటి రోజు నుంచీ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఫాలో అప్ మాటలు, కథనాలు కూడా ఏమీ లేవు. రోజంతా బురదచల్లుడు కార్యక్రమం చేసి ఆ వెంటనే ఎలా మర్చిపోయారు? పాదాభివందనం నిరూపిస్తే విజయసాయి రాజకీయాల నుంచే తప్పుకుంటునన్నాడుగా…….మరి విజయసాయి వ్యూహాలు, ప్లానింగ్ దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న చంద్రబాబు విజయసాయిని ఇంటికి పంపించే మహదవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నట్టు?
మోడీకి విజయసాయి పాదాభివందనం చేశాడు అన్న సిఎం రమేష్……ఆ తర్వాత ‘నేను చూడలేదు…ఎవరో చెప్తే విన్నాను’ అన్నాడు. సుజనా చౌదరి మరో కథ వినిపించాడు. ఇక మోడీ కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటే విజయసాయి షేక్ హ్యాండ్ ఇస్తూ మోడీ పాదాలను టచ్ చేయాలని చూశాడు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కవరింగ్‌తో కప్పి పుచ్చుకున్నాడు.
మొత్తంగా చూస్తే రాజ్యసభలో ప్రతి చిన్న విషయం కూడా కెమేరాలలో రికార్డ్ అవుతుందని తెలిసి కూడా చంద్రబాబు అండ్ కో ఈ స్థాయి అబద్ధపు డ్రామాలకు తెరలేపారంటే …….ఇక ఇతర విషయాల్లో చెప్పేవి ఏ స్థాయి అబద్ధాలు అయి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా? రామ…… రామ……. చంద్రబాబు అబద్ధాలు మామా అని భవిష్యత్తులో తెలుగువారు ఓ కొత్త సామెతకు అలవాటు పడడం కూడా ఖాయం. కాదంటారా?
