Saturday, April 27, 2024
- Advertisement -

కామన్వెల్త్ క్రీడ‌ల్లో సైనాకు చేదు అనుభ‌వం….

- Advertisement -

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కి కామన్వెల్త్ క్రీడా గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభంకానున్నాయి. రెండు వారాల క్రితం క్రీడాకారులతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని కామన్వెల్త్‌ గేమ్స్‌కి అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పగా.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం పీవీ సింధు వాళ్ల అమ్మ, సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్‌‌కి అనుమతి ఇచ్చారు.

అయితే సైనాతో కలిసి గోల్డ్‌కోస్ట్‌ వెళ్లిన వాళ్ల నాన్న హర్వీర్‌ సింగ్‌ను క్రీడా గ్రామంలోకి అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా సైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లే ముందు మా నాన్న పేరు.. జట్టు అధికారిగా జాబితాలో ఉంది. అందుకైన ఖర్చులను కూడా మేమే చెల్లించాం. కానీ క్రీడాగ్రామం దగ్గరకు వచ్చేసరికి ఆయన పేరును అధికార్ల జాబితా నుంచి తీసేశారు. ఇప్పుడాయన నాతో ఉండడానికి వీల్లేదు. నా మ్యాచ్‌లనూ చూడలేరు. క్రీడాగ్రామంలోకీ ప్రవేశించలేరు. నన్ను కలవలేరు. ఇది ఏ రకమైన సహకారం’’ అని సైనా ట్వీట్‌ చేసింది. పీవీ సింధు తల్లిని మాత్రం ఆమెతో క్రీడాగ్రామంలోకి అధికారులు అనుమతించారు.

Surprise to see that when we started from India for commonwealth games 2018 my father was confirmed as the team official and I paid the whole amount for that but when we came to the games village … his name was cut from team official category .. and he can’t even stay with me .

— Saina Nehwal (@NSaina) April 2, 2018

He can’t c my matches and he can’t enter the village nor he can meet me in anyway .. what kind of support is this ..@thecgf

— Saina Nehwal (@NSaina) April 2, 2018

I wanted his support as I regularly take him for my competitions …but i didn’t understand why nobody informed me all this earlier .. that he can’t enter anywhere #CommonwealthGames2018

— Saina Nehwal (@NSaina) April 2, 2018

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -