Tuesday, May 14, 2024
- Advertisement -

స్టేడియానికి స్యామీ పేరు

- Advertisement -

పొట్టి క్రికెట్ హీరోలు వెస్టిండీస్ ఆటగాళ్లకు ప్రపంచమంతా నీరాజనాలు పలుకుతోంది. జట్టు వెస్టండిస్ చేరుకోగానే వారికి ఘన స్వాగతం లభించింది. ఇక కెప్టెన్ డారెన్ స్యామీకైతే మరీను. సెయింట్ లూసియాలోని ది బ్యుసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టేశారు.

సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జార్సన్ చార్లెస్ లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ స్వయంగా ఘనస్వాగతం పలికారు. ఆ సందర్భంలోనే స్టేడియం పేరు మార్పును ప్రకటించారు. ఇక స్యామీ అయితే తనకు లభించిన గౌరవానికి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

కరేబియన్ దీవులు వెస్టిండీస్ పేరుతో దశాబ్దాల కాలంగా క్రికెట్ ఆడుతున్నాయి. ఇక సెయింట్ లూసియన్ కు చెందిన స్యామీ, జాన్సన్ చార్లెస్ లు అంతర్జాతీయ జట్టుకు ఆడుతున్నారు. స్యామీ సారధ్యంలో జట్టు రెండు సార్లు టి – 20 కప్ గెలుచుకోవడం మరో విశేషం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -