Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు కి చుక్కలు చూపించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ?

- Advertisement -

అసలే వలస కాలం ఇది! ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వైకాపా నుంచి కొంతమందిని బాగానే లాక్కొచ్చింది దేశం. అయితే, ఇప్పుడు నందమూరి హరికృష్ణ వ్యవహారం మాత్రం ఎవ్వరికీ అర్థం కానట్టుగా మారుతోంది. నిజానికి, ఆయన యాక్టివ్ పాలిటిక్స్కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా వైకాపా నాయకుడు కొడాలి నానితో కలసి విజయవాడలో దర్శనమిచ్చారు.

దాంతో ఊహాగానాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. నానీ తెలుగుదేశంలోకి జంప్ చేస్తారా అనే అనుమానాలు కూడా కొన్ని వ్యక్తం అయ్యాయి. అయితే, వాటిపై నాని క్లారిటీ ఇచ్చేశారు. తాను వైకాపాను విడిచిపోయేది లేదని, జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు చర్చ అంతా మళ్లీ హరికృష్ణవైపు మళ్లింది. హరికృష్ణ వైకాపాలోకి వచ్చే అవకాశాలున్నాయా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

కొడాలి నాని, హరికృష్ణల దోస్తీ అందరికీ తెలిసిందే. సో… నాని ద్వారా హరికృష్ణని వైకాపాలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయని ఓ ప్రచారం ఉంది. త్వరలోనే రాజ్యసభ సీట్లు ఓ నాలుగు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. దేశం పార్టీ నుంచి హరికృష్ణ రాజ్యసభకు వెళ్దామని చూసినా.. అది జరిగేట్టు లేదన్నది సుస్పష్టంగానే కనిపిస్తోంది. వైకాపాకు ఒక సీటు వస్తుంది. మరో సీటుకు వీలైతే హరికృష్ణను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందీ అన్నది వైకాపా ఎత్తుగడ కావొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అలాగే, ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైకాపా నాయకులను దేశం పార్టీ ఎరవేసి మరీ ఎగరేసుకెళ్తోంది. ఈ వలసలకు సరైన బుద్ధి చెప్పాలంటే… తెలుగుదేశం వ్యవస్థాపకుడి కుమారుడైన హరికృష్ణనే వైకాపాలోకి తీసుకొస్తే… చంద్రబాబు మాంచి ఝలక్ ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనలో వైకాపా పెద్దలు ఉన్నారనీ ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా వైకాపాకి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ… హరికృష్ణ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని, రాజ్యసభ సీటు ఇవ్వలేకపోయినా ఆయన్ని పార్టీలో మర్యాద దాయకమైన స్థానం కల్పిస్తామని చెప్పుకొచ్చారు! మొత్తమ్మీద హరికృష్ణ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరో రెండుమూడు రోజులు ఆగాల్సిందే. వీటన్నిటి వెనకాలా జూనియర్ ఎన్టీఆర్ హస్తం కూడా ఉంది అనీ కళ్యాణ్ రాం , జూనియర్ ఎన్టీఆర్ , హరి కృష్ణ కలిసే చంద్రబాబు కి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -